కాసిపేట గని ఉద్యోగుల పదవి విరమణ సన్మానం.

కాసిపేట గనిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులను సన్మానిస్తున్న అధికారులు కార్మిక సంఘాల నాయకులు
Scv News Kasipet:--
మందమర్రి ఏరియా కాసిపేట గనిలో పని చేసి ఉద్యోగ విరమణ పొందిన ముగ్గురు కార్మికులను ఈరోజు గని ఆవరణలో సింగరేణి యాజమాన్యం వివిధ కార్మిక సంఘాల నాయకులు శాలువాలతో సన్మానించారు. సన్మానం పొందిన వారిలో స్వామి రావు,మైనింగ్ సర్దార్, పెట్టేం రాజేశం, సపోర్ట్ మెన్,ముత్తె భూమయ్య,సర్ఫేస్ ట్రామర్ లు ఉన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు చేసిన సేవలను యూనియన్ ప్రతినిధులు వారి సేవలను గుర్తు చేసుకున్నారు. గని మేనేజర్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ ఆఖరు రోజు వరకు కూడా ఉద్యోగంలో నిబద్దత తో,పని పైన మక్కువ తో పని చేసిన వ్యక్తి స్వామి రావు,రాజేశం,భూమయ్యా లు ఇద్దరు పని అప్పగిస్తే పని పూర్తి అయ్యే వరకు విశ్రమించాని వారిని అన్నారు.
ఈ కార్యక్రమంలో SO సునీల్,అండర్ మేనేజర్ నిఖిల్, సంక్షేమ అధికారి మీర్జా, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్,గని సెక్రెటరీ మీనుగు లక్ష్మీ నారాయణ, టీబీజీకే స్ నాయకులు వడ్నాల రాజన్న,బైరి శంకర్,బన్న లక్ష్మన్ దాస్,సర్పంచ్ వేముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ పొందిన కార్మికుడిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు.
కాసిగనిలు సపోర్ట్ మెన్ గా పనిచేసే ఉద్యోగం విరమణ పొందిన మండల కాంగ్రెస్ నాయకుడు పట్టెం రాజేశం ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ, మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి తదితర నాయకులంతా లు సాలువతో సన్మానించారు.

