ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను నిలిపివేయాల ని గిరిజన సంఘాల నాయకు లు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు.

దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు నిర్మించే అక్రమ కట్టడాల నిలిపివేయాలని ఫిర్యాదు చేస్తున్న ఆదివాసి నాయకులు.
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతాల్లో వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి విరుద్ధంగా నిర్మిస్తున్న కట్టడాలను ఆపివేయాలని కాసిపేట మండల ఆదివాసి సంఘాల నాయకులు ఈరోజు బెల్లంపల్లి సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు పక్కా భవనాలను నిర్మించరాదనే ఏజెన్సీ చట్టాలు తెలుపుతున్న వాటిని పట్టించుకోకుండా బహులాంతస్తుల బిల్డింగులు నిర్మాణం చేస్తున్నారని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని గ్రామపంచాయతీ మండలాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన ప గిరిజనేతర నాయకుల ప్రలోభాలకు లొంగి అక్రమ కట్టడాలను పట్టించుకోవడంలేదని ఆదివాసి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై విచారణ జరిపిచర్య తీసుకోవాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కు నాయక్ కోడ్ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాబు, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కనకరాజు, గిరిజన సొసైటీ గౌరవ అధ్యక్షుడు కుర్షింగ నాగేశ్వరరావు , ఆదివాసి మండల నాయకులు సోమని మల్లేష్, సిడం శంకర్లు ఫిర్యాదు చేశారు.