కాసిపేట మండల వాసి ఈఈ, ఉట్ల నరసింహచారికి సన్మానం.

ఏఈ ఉట్ల నరసింహ చారిని సన్మానిస్తున్న మంచిర్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు.
Scv News Kasipet:--
కాసిపేట మండలం ముత్యంపల్లి నివాసి ఉట్ల నరసింహచార్యులు పంచాయతీరాజ్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తు న్నారు. ఇటీవల పెద్దపెల్లి జిల్లా నుండి మంచిర్యాల జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా ఈరోజు కాసిపేట విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ కాసిపేట వాస్తవ్యులు ఉట్ల నరసింహ చార్యులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సీలోజు మురళి చార్యులు జిల్లా అధ్యక్షులు మట్టెల రమేష్ చార్యులు జిల్లా కోశాధికారి రమణాచార్యులు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధరాచార్యులు కాసిపేట మండల కార్యదర్శి గొల్లపల్లి రాజేందర్ చార్యులు గ్రామ అధ్యక్షులు చింతోజు ప్రభాకర్ చార్యులు గ్రామ కార్యదర్శి సీలోజు శ్రీనివాస్ చార్యులు గ్రామ కోశాధికారి సీలోజు నరసింహచార్యులు చేట్టన్నోజు శ్రీనివాస్ చార్యులు గద్దెలపల్లి రమేష్ చార్యులు పాల్గొనడం జరిగింది.