మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ధర్మ రావు పేట లో చీరల పంపిణీ.

 ధర్మరావుపేట లో

కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ చిరేల పంపిణీ.

 ధర్మరావుపేటలో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ కొక్కిరాల సురేఖ.


 గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న కొక్కిరాల సురేఖ.


Scv News Kasipet:--

 కాసిపేట మండలంలోని ధర్మారావు పేట గ్రామంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ జరిగింది. 5 గ్రామ పంచాయతీలు ధర్మారావుపేట,కొనూర్,తాటిగూడ, కొండాపూర్ యాప,లంబడితండా (డి)లకు చెందిన మహిళాలకు బతుకమ్మ పండుగ సందర్భంగా కీ శే రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  ట్రస్ట్ వైస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖమ్మ లు చేతుల మీదుగా మహిళలుకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నుద్దేశించి మాట్లాడుతూ సురేఖ మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 10 సం రాలు గా మంచిర్యాల నియోజకవర్గం లోని అన్ని మండలాలకు అలాగే ఈ మండలంలో కూడా బతుకమ్మ చీరేలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సారి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యాంరెంటిలు ప్రకటించారు అందులో ముఖ్యంగా మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం, అలాగే 500 లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్రంలో ప్రతి మహిళలకు ప్రతి నెలా 2500 రూపాయలు ఖర్చులకు ఇవ్వడం జరుగుతుంది.  మీరు అంతా దయచేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సర్పంచ్ వేముల కృష్ణ, ధర్మారావు పేట యంపిటిసి పార్వతి మల్లేష్,సీనియర్ నాయకులు ఏనుగు జనార్ధన్ రెడ్డి మాజి సర్పంచులు  జాడి శంకర్, ప్రభాత్ రావు, మైనారిటీ సెల్ నాయకులు షాకీర్, సీనియర్ ఆదివాసీ నాయకులు కనకరాజు, గెడం సితారం,ఖలీమ్, ఉడుతల రాజన్న,మహేశ్,పౌలు, చంద్రయ్య, కాటిక శంకరయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు జంగిళి రమేష్, మహంకాళి,చారి,లు పాల్గొన్నారు.