కొండాపూర్ చౌరస్తాలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి.
-- బహుజన వర్గం లోని కులాలన్నీ ఐకమత్యం కావాలని ప్రజాసంఘాల నాయకుల పిలుపు.
![]() |
| కొండాపూర్ చౌరస్తాలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న రజక సంఘం ప్రజాసంఘాల నాయకులు. |
Scv News Kasipet:--
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి కార్యక్రమం కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తాలో ఈరోజు తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు దావనపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ రజకులు ఆత్మగౌరవంగా సమాజంలో నిలబడడానికి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి కారణమని అన్నారు. ప్రతి సంవత్సరం రజకులు చాకలి ఐలమ్మ స్మారకంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తు న్నామని అన్నారు. చాకలి ఐలమ్మ జన్మదిన వర్ధంతి కార్యక్రమాల్లో వివిధ కుల సంఘాల నాయకులు కూడా పాల్గొనాలని కోరారు.
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణలో నైజాం ప్రభుత్వానికి కరుడుగట్టిన భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి తమ భూములను దక్కించుకున్న వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే నాడు తెలంగాణలో భూమి భుక్తి విముక్తి కోసం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం నడిచిందని గుర్తు చేశారు. రజకులు గ్రామాల్లో ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ వారి మురికి బట్టలనంత శుభ్రం చేసి తెల్లగా ఇస్త్రీ చేసి ఇస్తే మనము గౌరవంగా తిరుగుతున్నామని వారి సేవలను అన్ని కులాల వారు గుర్తించాలన్నారు. దేశంలోని బహుజన కులాలకు చెందిన రజక, మంగలి కుమ్మరి, గౌడ, యాదవ, పద్మశాలి గంగపుత్ర కులాలన్నీ ఐక్యం కావాలని అన్నారు. మన మధ్య ఐకమత్యం లేకుండా అగ్రకులాల నాయకులు విడదీసి పాలించే రీతిలో మన మధ్యల గొడవలు పెడుతున్నారని అన్నారు. మన కులాల మధ్య ఐక్యమత్యం లేకుండా కొంతమంది మనవారిని చేరదీసుకుని మందు, విందులు, ఇస్తూ ప్రలోభాలకు గురిచేసి వారి చెంచాలుగా మార్చుకొని మన మధ్య గొడవలు పెడుతున్నారని వీరిని బహుజన కులాలు గుర్తించాలని అన్నారు.
మనమంతా బానిస మనస్తత్వాలను వీడి ఆత్మగౌరవంతో బ్రతికి అభివృద్ధిలోకి రావాలంటే బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నట్లుగా రాజ్యాధికారమే అంతిమ పరిష్కారమని అన్నారు.మన ఓట్లను డబ్బులకు మందు,విందులకు ఆశపడి అమ్ము కోకుండా మన ఓట్లు మనం వేసుకుని బహుజనులే రాజ్యాధికారాని కి రావాలని అన్నారు. అప్పుడే మన దారిద్రం పోయి అభివృద్ధిలోకి వస్తామని అన్నారు. మండలంలోని బీసీ కులాలన్నీ ఐకమత్యం కావాలని అన్నారు.
సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ మామూలు గ్రామీణ ప్రాంతంలోని రజకుల కుటుంబంలో పుట్టి ఎంతో ధైర్య సాహసంతో భూస్వాముల ను ఎదుర్కొని భూములు కాపాడుకున్న వీరనారి అని అన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బహుజన వర్గాలలోని అన్ని కులాలు ఐక్యమత్యమై తమకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలని అన్నారు. అగ్రకుల పార్టీల నాయకుల పాలనలో బహుజన వర్గాలకు న్యాయం జరగదని స్వాతంత్రం వచ్చిన గత 76 సంవత్స రాల నుండి ఇప్పటికి మన వర్గాలు పేదరికంలో ఉండడమే ప్రత్యక్ష సాక్షమని అన్నారు. బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు పొందుపరిచిన హక్కులతో మన కులాలన్నీ ఏకమై మన ఓటు మనం వేసుకుని రాజ్యాధికారానికి వచ్చేందుకు ఐక్యం కావాలని కోరారు. బహుజన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ చేసే జన్మదిన వర్ధంతి కార్య క్రమాలలో అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొని స్మరించు కోవాలని అన్నారు.
తుడుం దెబ్బ మండల నాయకులు మడావి వెంకటేష్ మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో పుట్టిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం కావాలని అన్నారు. నేటి సమాజంలో బహుజన వర్గ నాయకుల మంతా ఏకమైనప్పుడే మనకు న్యాయం జరుగుతుందని అందరము ఆ దిశగా ఆలోచించాలని అన్నారు.
మండల అంబేద్కర్ సంఘం నాయకుడు దాసరి రాజన్న మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిందని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మల ప్రతి మహిళ తమకు జరుగుతున్న అన్యాయాలపై ముందుకు వచ్చి ఉద్యమంచినప్పుడు సమాజం అభివృద్ధిలోకి వస్తుందని అన్నారు.
రజక సంఘం నాయకుడు శ్రీరాముల వెంకటేష్ మాట్లాడుతూ రజక కుటుంబం కు చెందిన చాకలి ఐలమ్మ తమ కుటుంబానికి జరిగిన అన్యాయం పై భూస్వాములపై తిరుగుబాటు చేసిన పోరాటం మిగత కులాలకు కూడా ఎంతో స్ఫూర్తినిచ్చింది అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని అన్ని కులాల వారు కులమత భేదాలను వీడి ఐక్యంగా ముందుకు వెళ్లి అప్పుడే సమాజం అభివృద్ధిలోకి వస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కొండాపూర్ ఉప సర్పంచ్ పోడేటి సుమన్,మండల రజక సంఘం ప్రధాన కార్యదర్శి చందనగిరి రమేష్, దేవాపూర్ రజక సంఘం అధ్యక్షుడు సంగెపు పోషం, మండల నా రజక సంఘం నాయకులు కొలిపాక నాగరాజు, రాచకొండ శ్రీనివాస్, ఆటో యూనియన్ అధ్యక్షుడు బందెల వెంకటస్వామి, దొంతుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.