మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన బిజెపి జిల్లా నాయకులు.

  కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన బిజెపి జిల్లా నాయకులు.


 కాసిపేట మండలంలోని బిజెపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్న జిల్లా నాయకులు.

Scv News Kasipet:--

 కాసిపేట మండలంలో వివిధ గ్రామాలలో బిజెపి కార్యకర్తల కుటుంబాలను మంచిర్యాల జిల్లా బిజెపి నాయకులు ఈరోజు పరామర్శించారు. కాసిపేట మండల బిజెపి ఉపాధక్షులు బాకీ నరేష్ గారి తండ్రి లింగయ్య గారు పరమపదించగా  BJYM జిల్లా అధ్యక్షులు పట్టి వెంకట క్రిష్ణ  వారి కుటుంబాన్ని  పరామర్శించి  రైస్ బ్యాగు అందించడం జరిగింది. 

అనంతరం దేవపుర్ గ్రామానికి చెందిన యువకుడు గణేష్ నిన్న అనారోగ్యంతో మంచిర్యాల ప్రెయివేట్ హాస్పిటల్లో ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసి వారి తల్లిదండ్రులను పరామర్శించి గణేష్ మృతికి గల కారణాలు వైద్య సిబ్బందితో మరియు ఆరోగ్య అధికారులతో మాట్లాడి గణేష్ కుటుంబానికి తగు న్యాయం జరిగేలా చూస్తాను అని హామీ ఇవ్వండి జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్,బిజెపి అసెంబ్లి కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్ గారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రేవెల్లి రాజలింగు గారు మండల  నాయకులు రెడ్డి బాలరాజు, పెద్దపెల్లి శంకర్ , దోమల రామచందర్, చొప్పదండి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు....