కాసిపేట మండల బిజెపి అధ్యక్షుడిగా సూరం సంపత్ కుమార్.

బిజెపి కాసిపేట మండల పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన సూరం సంపత్ కుమార్. 
జిల్లా అధ్యక్షుడు రఘునాధరావు చేతుల మీదుగా నియామక పత్రం అందుకుంటున్న సూరం సంపత్ కుమార్.
Scv News Kasipet:--
కాసిపేట మండల బిజెపి అధ్యక్షుడిగా సూరం సంపత్ కుమార్ ను నియమిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథరావు నియామక పత్రాన్ని బెల్లంపల్లి నియోజకవర్గ బిజెపి నాయకుల సమక్షంలో ఈరోజు మంచిర్యాలలో అందజేశారు. మండల బిజెపి అధ్యక్ష పదవి రావడానికి సహకరించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్, అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ నియోజకవర్గ మండల నాయకులందరికీ సూరం సంపత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలలో బిజెపి పార్టీ బలవపేతానికి శాశ్వతుల కృషి చేస్తానని బిజెపి జిల్లా నాయకులకు హామీ ఇస్తున్నానని తెలిపారు.
అంచెలంచెలుగా మండల బిజెపి అధ్యక్షుడిగా ఎదిగిన సంపత్ కుమార్.
కాసిపేట మండలం చిన్న ధర్మారం గ్రామానికి చెందిన సూరం సంపత్ కుమార్ బిజెపి పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుండి క్రమక్రమంగా మండలం పార్టీ అధ్యక్షుడుగా ఎదిగారు. గత రెండు సంవత్సరాలుగా బిజెపి పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి నుండి బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి గా పనిచేస్తూ మండల అధ్యక్షుడిగా నియామకం అయ్యాడు. బిజెపి పార్టీ నాయకుడిగా మండలంలో చురుకుగా పనిచేస్తూ పలు సమస్యలపై ఉద్యమాలు చేసి గుర్తింపు పొందాడు.గ్రామంలో తాగునీటి సమస్య, రైతుల సమస్యలపై,కేకే ఓ సి లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై పోరాడారు. ముత్యం పల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి ఫ్యాను అందజేసి సేవా కార్యక్రమాలు కూడా చేశారు. సంపత్ మండల పార్టీ అధ్యక్షుడుగా నియామకంతో బిజెపి మండలంలోని గ్రామాల్లో విస్తరించే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
