ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న కాసిపేట మండల వాసి అట్ కాపురం రమేష్ .
![]() |
| హైదరాబాదులో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేస్తున్న దేవాపూర్ వాసి అటకాపురం రమేష్. |
Scv News Kasipet:--
బెల్లంపల్లి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో కాంట్రాక్టర్ వర్కర్ గా పని చేస్తున్న అట్క పురం రమేష్ ఈరోజు హైదరాబాదులోనీ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. రమేష్ మండలంలో వివిధ ప్రజా సమస్యలపై బిజెపి పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కరోనా సమయంలో ఎంతోమంది పేదలను ఆదుకొని అనునిత్యం ప్రజల్లో ఉంటు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తిగా ప్రజల్లో ఉంటున్న అట్కపురం రమేష్ గారిని బిజెపి రాష్ట్ర పార్టీ మరియు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గుర్తుంచి బిజెపి అభ్యర్థిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బెల్లంపల్లి గడ్డ పైన బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆయన మద్దతు దారులు అధిష్టానాన్ని కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే కార్యక్రమంలో ఆయన వెంట పోలవేణి పోషం. తులమధు సూదన్ ,దినేష్ ఉపాధ్యాయ, మోహన్, ప్రవీణ్,కమల. తదితరులు బిజెపి నాయకులు. పాల్గొన్నారు.

