మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మల్కపల్లి ఆశ్రమ పాఠశాలలో ఘనంగా సర్దార్ భగత్ సింగ్ జయంతి.

 మల్కపల్లి ఆశ్రమ పాఠశాలలో ఘనంగా సర్దార్ భగత్ సింగ్ జయంతి.



 ముల్కపల్లి ఆశ్రమ పాఠశాలలో భగత్సింగ్ జయంతి కార్యక్రమంలో విద్యార్థులు.



Scv News Kasipet :--

 కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో గురువారం సర్దార్ భగత్ సింగ్ 116వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు వేములవాడ రమేష్, శ్రీరాముల వెంకటేష్, ఆరోగ్య కార్యకర్త లలిత పూల మాలలు సమర్పించి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్రానికి చెందిన భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణ త్యాగాలు ఇచ్చిన మహనీయ మూర్తి అని కొనియాడారు. భగత్ సింగ్ లాంటి యోధుల జీవిత చరిత్రలు విద్యార్థులు తెలుసుకొని దేశం కోసం సమాజం కోసం పనిచేయాలనే లక్ష్యంతో సామాజిక చైతన్య వేదిక పాఠశాలలో మహనీయుల జయంతులు నిర్వహిస్తుందని అన్నారు. భగత్ సింగ్ యొక్క జీవితము అతని పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులంతా చిన్నప్పటినుండే క్రమశిక్షణతో  జీవితాలను కొనసాగిస్తూ సమాజ మార్పు కోసం కృషి చేయాలని కోరారు.


ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు వేములవాడ రమేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ అనే పేరును నోటితోని పలుకుతేనే  మనలో ఒక వైబ్రేషన్ వస్తుందని అతి చిన్న వయసులో 23 ఏళ్ల లోనే దేశం కోసం బ్రిటిష్ వారిచే ఉరి తీయబడ్డ విప్లవయోధుడని అన్నారు. దేశంలో నుండి బ్రిటిష్ వారిని తరిమి కొట్టేందుకు పోరాటం చేశారని  నేటి విద్యార్థులు భగత్ సింగ్ జీవితాన్ని చదివి  పాటుపడాలని అన్నారు. విద్యార్థులకు మహనీయుల జీవిత చరిత్రను అవగాహన కల్పించేందు కు సామాజిక చైతన్య వేదిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. 


ఉపాధ్యాయుడు శ్రీరాముల  వెంకటేష్ మాట్లాడుతూభగత్ సింగ్ భారత దేశ యువత స్ఫూర్తి ప్రదాత  ఆదర్శ నేత అని కొనియాడారు. అతిపిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన విప్లవ పోరాట యోదుడు భగత్ సింగ్ అని అన్నారు. విద్యార్థులు భగత్ సింగ్ యొక్క జీవితాన్ని అతన్ని ఆదర్శంగా తీసుకుని దేశం కోసం పనిచేయాలని కోరారు.