కాసిపేట మండలంలో ఆశ వర్కర్ల సమ్మె.
-- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆందోళన.
![]() |
| మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్ల ఆందోళన. |
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో సోమవారం గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలందించే ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు దిగారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 46 మంది ఆశా వర్కర్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు కూర్చుని తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్ల ఉద్దేశించి కాసిపేట సబ్ సెంటర్కు చెందిన ఆశా వర్కర్ అనురాధ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమకు ఇచ్చే పారితోషకాలను పిక్స్ వేతనం గా నిర్ణయించి 18000 ఇవ్వాలని కోరారు. ఆశాలకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
గట్రావ్ పెళ్లి సబ్ సెంటర్కు చెందిన ఆశా వర్కర్ భారతమ్మ మాట్లాడు తూ గ్రామాలలో గర్భిణీ స్త్రీలకు సేవలు చేయాలని చెప్పి పనిలోకి తీసుకున్న ప్రభుత్వం అన్ని పనులు చేయించుకుంటుందని అన్నారు. పని భారానికి తగ్గట్టుగా వేతనాలు కూడా పెంచాలని కోరారు.
కాసిపేట సబ్ సెంటర్ కు చెందిన ఆశా వర్కర్ దుర్గం సుశీల మాట్లాడుతూ ఆశా వర్కర్లకు తక్కువ వేతనం చెల్లించి నర్సుల కంటే ఎక్కువ పనులు చేయించుకుంటున్నారని మా సేవలను గుర్తించి వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే అంతవరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు.
మండల కేంద్రంలో గ్రామీణ ప్రాంతంలో సేవలందించే అంగన్వాడి,ఆశా వర్కర్ల సమ్మె ఆందోళనలు, నల్ల గుడ్డతో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన, మానవహారం ఏర్పాటు తమ సమస్యల పరిష్కరించాలని, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలనే నినాదాలతో మారు మోగింది.




