మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అంగన్వాడి ఉద్యోగులకు సమ్మెకు సిపిఐ జేఏసీ నాయకులు మద్దతు.

 

 న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేయాలి.

 -- దాగం మల్లేష్ సిపిఐ మండల కార్యదర్శి.

 అంగన్వాడి ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా శిబిరంలో కూర్చున్న సిపిఐ, జేఏసీ నాయకులు.


Scv News Kasipet:---

కాసిపేట మండల కేంద్రంలో  అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని రాష్ట్రకమిటీ పిలుపుమేరకు  మండలంలోని వివిధ గ్రామాల కార్యకర్తలు ఈరోజు సమ్మెకు దిగి నిరాహార దీక్షలో కూర్చున్నారు. వీరికి మండల సిపిఐ పార్టీ, ఏసి నాయకులు మద్దతు పలికారు. 

అంగన్ వాడి  ఉద్యోగులకు కనీస వేతనాలు 26,000 చెల్లించాలని గ్రాడ్యుటి అమలు పరచాలని రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ పెంపు ఇతర సమస్యల పరిష్కారం కోసం నేడు 11-09 -2023 నుండి   రాష్ట్రవ్యాప్తంగా జరిగే  నిరవధిక సమ్మెకు జయప్రదం చేయాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్ జాయింట్ యాక్షన్ కమిటీ (AITUC, CITU) కాసిపేట మండలంలో నేడు ఎమ్మార్వో కార్యాలయం వద్ద   ప్రారంభం అయినది. ఈ అంగన్వాడీ ఉద్యోగులకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రేగుట్ట చంద్రశేఖర్, సిపిఐ మండల కార్యదర్శి దాగం మల్లేష్, ఏఐటీయూసీ నాయకులు జాడి పోచం, గట్టు సర్వేశం,దాగం రాజలింగు, అంకులు, జేఏసీ నాయకులు సులోజు మురళి  దాసరి రాజయ్య  సంఘీభావం తెలపడం జరిగినది. వీరి న్యాయమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవే చూపెట్టాలని లేని పక్షంలో మరి సమ్మెను ఉదృతం చేసి రాష్ట్ర ప్రభుత్వం దిగచ్చేవరకు సమ్మె కొనసాగుతుందని  వారి  సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నామని  సిపిఐ మండల కార్యదర్శి దాగం మల్లేష్ తెలిపారు.