12వ రోజు కొనసాగిన అంగన్వాడి టీచర్లు ఆయాల సమ్మె.
![]() |
| కాసిపేట మండల కేంద్రంలో దీక్షా శిబిరంలో తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు. |
Scv News Kasipet:--
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, సమ్మె శుక్రవారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉదయం నుండి రెవెన్యూ కార్యాలయం ముందు దీక్షా శిబిరంలో కూర్చుని తమ సమస్యలు పరిష్కరించాలని ప్లే కార్డులతో నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అంగన్వాడి టీచర్లు ఆయాలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు భాగ్యలక్ష్మి,సంగీత, జ్యోతిలత,శంకరమ్మ,సాహెరా రాజ్యలక్ష్మి, తదితర టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.
