అంగన్వాడి టీచర్లు ఆయాల ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.
-- సూరం సంపత్ కుమార్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు డిమాండ్.
Scv News Kasipet:--
అంగన్వార్డ్ టీచర్ల సమ్మెలో పాల్గొని మద్దతు తెలుపుతున్న మండల బిజెపి నాయకులు.
కాసిపేట మండల కేంద్రంలో మూడు రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న అంగన్వాడి టీచర్లు ఆయాలకు సమ్మెకు
ఈరోజు కాసిపేట్ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతు తెలిపి దీక్ష శిబిరంలో కొద్దిసేపు కూర్చొని సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమం ఉద్దేశించి మండల అధ్యక్షుడు సూరం సంపత్ మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం రూ. 26,000/-లు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ. 10 లక్షలు, హెల్వర్లకు || రూ. 5 లక్షలు చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలని,60 సంవత్సరాల తర్వాత అంగన్వాడీ ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ కోరితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం రూ.5 లక్షలు చెల్లించాలని గత నిబంధనల ప్రకారం ఎస్ఎస్ సి ఆర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని,సీనియారిటీని బట్టి వేతనంలో వ్యత్యాసం ఉండాలన్నారు. ఇంక్రిమెంట్ సౌకర్యం కల్పించాలని,బిఎల్ డ్యూటీలు రద్దు చెయ్యాలని, ఐసిడిఎస్ కు సంబంధం లేని పనులను చేయించకూడదన్నారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తిస్తూ ప్రకటించిన సర్క్యులర్ను వెంటనే జారీ చేయాలని,ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచి, బలోపేతం చేయాలని, పక్కాభవనాలు, మౌలిక వసతులు కల్పించాలని, 2018 అక్టోబర్ లో కేంద్రం పెంచిన | వేతనం అంగన్వాడీ టీచర్లకు రూ.1,500/-లు, హిల్వర్లకు రూ.750/-లు, మినీ వర్కర్లకు రూ. 1.250/-లు రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్ తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. 2017 నుండి టీఎ, డిఎ, ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెన్స్ బకాయిలు మొత్తం చెల్లించాలి.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ మరియు మండల ఉపాధ్యక్షులు భాకి నరేష్ బెల్లంపల్లి అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ భూక్య అరవింద్,బిజెపి నాయకులు రెడ్డి బాలరాజు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు యూసఫ్ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి చొప్పదండి విష్ణువర్ధన్ శక్తి కేంద్రం ఇంచార్జ్ రామచందర్ భాకి సురేష్, జాడి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.