మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు ఆయాల ఊరేగింపు.

 ఎనిమిదవ రోజుకు చేరుకున్న  అంగన్వాడి టీచర్ల సమ్మె.


 కాసిపేట మండల కేంద్రంలో సమ్మెలో కూర్చుని ఆందోళన చేస్తున్న అంగన్వాడి  టీచర్లు ఆయాలు.



Scv News Kasipet:--

అంగన్వాడి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్&వర్కర్స్ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈనెల 11వ తేది నుండి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. సోమవారం కాసిపేట మండలంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు దీక్షా శిబిరం లో కూర్చొని ఆందోళన చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని మండల కేంద్రంలో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, సంగీత, రాజ్యలక్ష్మి, జ్యోతిలత, శంకరమ్మ, సాహేరా, లక్ష్మి, భారతి, రుక్మిణీ, విమల, రజిని తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి టీచర్ల సమ్మె కు ఆదివాసి సంఘాల మద్దతు.

- అంగన్వాడీ టీచర్లు నాయకుల పై దురుసుగా వ్యవహరించిన ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్.

అంగన్వాడి టీచర్లు గత ఎనిమిది రోజులుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకపోవడంపై కాసిపేట మండల ఆదివాసి సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లిన అంగన్వాడీ టీచర్లను  సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సంఖ్య రవి పై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,కౌన్సిలర్ కొక్కుల  చంద్రశేఖర్ దురుసుగా  వ్యవహరించి అసభ్య పదజాలంతో  దూషించడాన్ని ఆదివాసి నాయకులు ఖండించారు. అంగన్వాడి టీచర్లకు సంకే రవికి క్షమాపణ చెప్పాలని ఆదివాసీ నాయక్ కోడ్ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, గిరిజన సమైక్య సొసైటీ గౌరవాధ్యక్షులు కురిసింగ నాగేశ్వర రావు, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కనకరాజు  నాయక్ కోడ్ సేవా సంఘం సాంస్కృతిక కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకురాలు కొమ్ముల రజిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.