కాసిపేట మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు.
-- ఒంటి కాలుపై అంగన్వాడి టీచర్లు,
![]() |
| ఒంటి కాలు పై నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు. |
| L |
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే అంగన్వాడి టీచర్లు ఆయాలు చేసే సమ్మె 18 రోజులకు చేరుకుంది.వైద్య సేవలందించే ఆశా వర్కర్ల సమ్మె 4వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆందోళనకు దిగారు.
ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వినూతన పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు.
అంగన్వాడి టీచర్లు ఒంటి కాలిపై నిలుచుండి తమ వేతనాలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
