బ్రతకడానికి జీతం పెంచుమంటే... సచ్చినవారికి రూ:20,10 వేలు ఇస్తమంటవా?
అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం ప్రభుత్వ నిరంకుషత్యానికి నిదర్శనం
బెదిరింపులు మానుకోకపోతే పోరాటం ఉదృతం
- సంకె రవి CPM జిల్లా కార్యదర్శి హెచ్చరిక.
![]() |
| కాసిపేట మండల అంగన్వాడి టీచర్ల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్న సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సంఖ్య రవి. |
ScvNewsKasipet:--
తెలంగాణ వ్యాప్తంగా ఐసిడిఎస్ లో పనిచేస్తున్న అంగన్వాడి టీచర్స్,హెల్పార్స్ సమస్యలను పరిష్కరించాలని,కనీస వేతనం రూ:26 వేల చెల్లించాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్,పెన్షన్ ఇతర సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 11 నుండి అంగన్వాడి లు సమ్మె నోటీస్ ఇచ్చి నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగింది. అంగన్వాడిలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటానికి అండగా ఉంటామని సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సంకె రవి సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70వేల మంది అంగన్వాడిలు పనిచేస్తు న్నారు. వీరంతా మహిళలు,బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే. 48 సంవత్సరాలుగా ఐ సి డి ఎస్ లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. అయినా వీరికి కనీస వేతనం అమలు చేయక పోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాని కి నిదర్శనం. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి అని ఆశించిన కార్మిక వర్గానికి నిరాశే ఎదురయింది. పైగా పని ఒత్తిళ్లు, అధికారుల వేధింపులు, సమయానికి రావాల్సిన సరుకులు రాకపోవడం ఇలాంటి అనేక ఇబ్బందులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన అంగన్వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం, వారి రాబోయే రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం అనేది గుర్తించాలని సిపిఎం గా హెచ్చరిస్తున్నాం.
నాడు చంద్రబాబు హయంలో అంగన్వాడి ఉద్యోగులకు వేతనాల పెంపుకై, ఇతర సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్ పిలుపులో భాగంగా వెళ్ళితే కార్మికుల పై గుర్రాలతో తొక్కించి, లాఠిచార్జి చేయించి, వాటర్ ట్యాంకర్లతో కొట్టించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఈరోజు ఎక్కడ లేకుండా చేసింది ఈ మహిళా కార్మికులే అనేది బిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించాలని తెలియజేశారు. ఒకవైపు అంగన్వాడి ఉద్యోగులు సమ్మెలో ఉంటే, ఇతర రంగాల ఉద్యోగులను తీసుకువచ్చి ఆ సెంటర్లను తెరిపియాలని ఒత్తిడి చేయడం, భయభ్రాంతులను సృష్టించడం ప్రభుత్వానికి ఈ కార్మికులు అంటే ఈ కార్మికుల న్యాయమైన డిమాండ్లు అంటే ఎంత భయమో అర్థం అవుతుంది.
ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు మానుకోకపోతే ఈ పోరాటాన్ని ప్రజా పోరాటంగా మలిచి బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అలాగే ఇతర రంగాల కార్మికులు అంగన్వాడి సెంటర్లకు వెళ్లి తాళాలు పగలగొట్టే పనులు మానుకోవాలని, కార్మికులకు కార్మికులకు మధ్య గొడవలు పెట్టించే కుట్రలను అర్థం చేసుకొని అంగన్వాడి ఉద్యోగులకు మద్దతుగా నిలవాలని తెలియజేశారు. అంతేకాకుండా అంగన్వాడి ఉద్యోగుల పోరాటానికి అన్ని రంగాల కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసి వారికి అండగా ఉండాలని సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాసిపేట మండల నాయకులు సిడాం జంగుబాయి,అంగన్వాడీ లు పాల్గొన్నారు.
