కాసిపేట మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్ల బోనాలతో నిరసన .
![]() |
| కాసిపేట మండల కేంద్రంలో బోనాలతో అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్ల ఊరేగింపు. |
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే అంగన్వాడి టీచర్లు ఆయాలు చేసే సమ్మె 19 రోజులకు చేరుకుంది.వైద్య సేవలందించే ఆశా వర్కర్ల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆందోళనకు దిగారు.
ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని బోనాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించినిరసన వ్యక్తం చేశారు. వినూతన పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు.

