మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

15 రోజులు చేరిన అంగన్వాడీ టీచర్ల ఆయాల సమ్మె.

 అంగన్వాడి టీచర్లు ఆయాలు నల్ల గుడ్డతో  కళ్లకు గంతలు కట్టుకొని నిరసన.

మానవహారంతో ఆందోళన.


 కాసిపేట మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు నల్ల గుడ్డతో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన.

Scv News Kasipet :--

 కాసిపేట మండల కేంద్రంలో సోమవారం గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే అంగన్వాడి టీచర్లు ఆయాలు, వైద్య సేవలందించే ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు దిగి ఆందోళనకు దిగడంతో దద్దరిల్లి పోయింది. మండల కేంద్రంలో ప్రధాన రహదారి అంగనవాడి టీచర్లు,ఆశా వర్కర్లు కూర్చుని  ఆందోళనకు దిగడంతో ప్రజలంతా వారి వద్దకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందచేసే మండలంలోని 26 అంగన్వాడి కేంద్రాలకు చెందిన  అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గత 15 రోజులుగా సమ్మె చేస్తుండడంతో వారి సేవలు నిలిచిపోయాయి. ఈరోజు ప్రభుత్వ విధానాలకు నిరసనగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు  నల్ల రిబ్బన్లతో కళ్ళ గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ మండల ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి ఆందోళనకు దిగారు.


ఈ సందర్భంగా ధర్మారావుపేట అంగన్వాడి టీచర్ రజని మాట్లాడుతూ 15 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. వెంటనే ప్రభుత్వ తమ సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని కోరారు.


చిన్న ధర్మారం అంగన్వాడి టీచర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లను తమిళనాడు పాండిచ్చేరిలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం కూడా తమను పర్మినెంట్ చేయాలని కోరారు.  తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మెను ఆపేది లేదని హెచ్చరించారు.


దేవాపూర్ అంగన్వాడి సెంటర్ కు చెందిన ఆయా స్వప్న మాట్లాడుతూ ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచుతూ పని భారాన్ని తగ్గించాలని అన్నారు. వయోభారంతో బాధపడుతున్న ఆయాల స్థానంలో వారి బంధువులను నియమించాలని  కోరారు.

 మండల కేంద్రంలో గ్రామీణ ప్రాంతంలో సేవలు అందించే అంగన్వాడి ఆశా వర్కర్ల సమ్మె ఆందోళనలు, అంగన్వాడీ టీచర్ల నల్ల గుడ్డతో కళ్ళకు గుంతలు కట్టుకొని నిరసన మానవహారం ఏర్పాటు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని నినాదాలతో మారు మోగింది.