అంగన్వాడి ఉద్యోగినులను పర్మినెంట్ చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్.
![]() |
| కాసిపేట మండల కేంద్రంలో సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ టీచర్లకు మద్దతు తెలుపుతున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు. |
![]() |
| దీక్షా శిబిరంలో కూర్చుని ఆందోళన చేస్తున్న అంగన్వాడి టీచర్లు ఆయాలు. |
కాసిపేట మండలకేంద్రంలో అంగన్ వాడీ టీచర్లు ఆయాల సమ్మె శనివారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. సమ్మెలో పాల్గొంటున్న టీచర్లు ఆయాలు తమ సమస్యలు పరిష్కరించాలని ప్లే కార్డులతో ఆందోళన చేశారు. అంగన్వాడి టీచర్లు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఈరోజుYSR తెలంగాణ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అజీమోద్దీన్ మరియు విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు ఒరం కవిరాజు సందర్శించి మద్దతు తెలిపారు. అంగన్వాడీ టీచర్లను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఏదైతే రాష్ట్రం వ్యాప్తంగా 70 వేల మంది కార్మికులు పనిచేస్తుంటే ఇందులో బడుగు బలహీన వర్గాల మహిళలు ఎక్కువ సంఖ్యలో వున్నారన్నారు. గత 48 సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవ చేస్తున్నారని వీరికి కనీస వేతనంగా 26000/-కలిగించ కపోవడం చాలా బాధాకర మన్నారు. వీరికి హెల్త్ కార్డు, వేతనంలో సగం పెన్షన్ రూపంలో ఇవ్వాలని -సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్ వాడి ఉద్యోగాలకు గ్రాట్యూటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం నాయకులు కాసిపేట చరణ్ , సునీల్ తదితరులు పాల్గొన్నారు.

