మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్ల ఆందోళన.

 కాసిపేట మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్ల ఆందోళన.

 - మోకాళ్లపై నిలబడి అంగన్వాడి టీచర్లు,

 - మానవహారంతో ఆశ వర్కర్లు నిరసన.

 మోకాళ్లపై నిలబడి ఆందోళన చేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు.



 మానవహారంగా ఏర్పడి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు.



SCV News Kasipet:--

 కాసిపేట మండల కేంద్రంలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే అంగన్వాడి టీచర్లు ఆయాలు చేసే సమ్మె 20 రోజులకు చేరుకుంది.వైద్య సేవలందించే ఆశా వర్కర్ల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ టీచర్లు, తమ వేతనాలను పెంచాలని ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ఉద్యోగ భద్రత ప్రమాద బీమా లాంటి తమ  న్యాయమైన సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. ప్రతిరోజు  అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు  ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని  వినూతన పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు అంగన్వాడి టీచర్లు  మోకాళ్ళ మీద నిలబడి  నిరసన వ్యక్తం చేస్తూ తమ వేతనాలు పెంచాలని  ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని  నినాదాలు చేశారు.  ఆగదు ఆగదు ఆగదు ఈ ఆకలి పోరు ఆగదు... అంటూ గద్దర్ పాటలకు అంగన్వాడీ టీచర్లు ఆయాలు బతుకమ్మ ఆటలు ఆడారు.

 ఆశా వర్కర్లు మానవహారంగా ఏర్పడి ఆందోళన.

ఆశా వర్కర్లుతమవేతనాలు పెంచాలని ఆరోగ్య బీమా, ప్రమాద బీమా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల ప్రధాన రహదారిపై మానవహారంగా నిలబడి  నిరసన వ్యక్తం చేశారు.

 మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల ఆందోళనలు, నినాదాలతో మారుమోగింది.

 అంగన్వాడి ఆశా వర్కర్ల ఆందోళనలకు సిపిఐ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సంకే రవి, మండల నాయకురాలు జంగుబాయిలు మద్దతు తెలిపారు.