అంగన్వాడి టీచర్లు ఆయాలకు కనీస వేతనం పెంచాలి.
- ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నాయకుల డిమాండ్.
![]() |
| కాసిపేట మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్ల సమ్మెకు సంఘీభావం తెలుపుతున్న సామాజిక చైతన్య వేదిక నాయకులు. |
![]() |
| అంగన్వాడి టీచర్ల సమ్మెకు మద్దతు తెలుపుతున్న సిపిఎం బిజెపి, సామాజిక చైతన్య వేదిక నాయకులు. |
Scv News Kasipet:---
కాసిపేట మండల కేంద్రంలో కనీస వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. అంగన్వాడి టీచర్ల సమ్మెకు మద్దతుగా ఈరోజు సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సంకే రవి, మండల నాయకురాలు జంగుబాయి, బిజెపి మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు, సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, సలహాదారులు మద్దినేని చిన్న భీమయ్య లు మద్దతు తెలిపి కొద్దిసేపు దీక్షా శిబిరంలో కూర్చుని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్ది నేని చిన్న భీమయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో అంగన్వాడి కార్యకర్తలు చిన్నారులకు విద్యా బోధన పౌష్టికాహారం అందిస్తూ ఎన్నో సేవలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి చిన్న ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించకుండా వారి శ్రమను ప్రభుత్వం దోచుకోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పించి సమ్మె విరమింప చేయాలని కోరారు.
సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ టీచర్లచే విద్య బోధనే కాకుండా వారితో ఎన్నో సర్వేలు చేయిస్తూ సేవలు చేసుకుంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యవసర వస్తువులు ఎన్నో రేట్లు పెరిగాయ ని వారికి కనీస వేతనం 20,000 నుండి 30 వేలకు ఇవ్వాలని అన్నారు. వారికి ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు 10 లక్షలు, కార్యకర్తలకు ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లంబడి తండా డి అంగన్వాడి టీచర్ రజని మాట్లాడుతూ మాకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు పెంచమంటే ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకుండా 65 ఏళ్లు సర్వీస్ పెంచామని చెబుతుందని ఐదేళ్ల సర్వీస్ అవసరం లేదని వేతనాలు పెంచాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని ప్రభుత్వానికి ఎన్నో సేవలు చేస్తున్న మమ్ములను గుర్తించి వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
చిన్న ధర్మారం అంగన్వాడి టీచర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మేము ప్రభుత్వ ఆస్తులను అడగడం లేదని కనీస వేతనాలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ చెల్లించాలని కోరుతున్నామని అన్నారు. బి ఎల్ వో డ్యూటీ లను వేయవద్దని కోరారు.

సండ్రల్ పహాడ్ అంగన్వాడీ టీచర్ స్వప్న మాట్లాడుతూ 2018 అక్టోబర్ లో కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు 1500 మినీ టీచర్లకు 1200 ఆయాలకు 750 రూపాయల వేతనాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింద న్నారు. అప్పటినుండి రాష్ట్ర ప్రభుత్వం ఆ వేతనాలు తమకు చెల్లించడం లేదని అప్పటినుండి బకాయిలతో తో చెల్లించాలని కోరారు.
దేవాపూర్ అంగన్వాడి టీచర్ విజయ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం మాపై దయవుంచి వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
చిన్న ధర్మారం అంగన్వాడి ఆయా సాహేరా మాట్లాడుతూ ప్రభుత్వం మమ్ములను కనీసం మనుషులుగా గుర్తించి మా కడుపులో నింపేందుకు సరిపడ వేతనాలు చెల్లించాలని వేడుకుంది.







