అమరవీరుల త్యాగాలకు గుర్తుగా తపాల శాఖ ఆధ్వర్యంలో మేరా మిట్టి- మేరా దేశ్ కార్యక్రమం
Scv News Kasipet:--
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమ గూడెం న్యూ కాలనీ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం తపాల శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల త్యాగాలకు గుర్తుగా మేరా మిట్టి- మేరా దేశ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమ గూడెం గ్రామంలో ఈ మేరా మిట్టి- మేరా దేశ్ కార్యక్రమం మేళా తాళాలతో అట్టహాసంగా మట్టి కా నమన్ వీరోన్ కా వందన్, అమృత కలశ యాత్ర గ్రామంలో చేపట్టడం జరిగింది.ఇలా సేకరించిన మట్టిని దేశ రాజధానిలో నీ నిర్మించబోయే నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరిలో అమూత పొంగవన్ గార్డెనకి పంప పడుతుందని పోస్టల్ అధికారి సిరికొండ సతీష్ గారు తెలిపారు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ వేముల కృష్ణ, గారు మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొనడం జరిగినది

