మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఆదివాసి గూడాలను సందర్శించిన గిరిజన సంఘాల నాయకులు.

 వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఆదివాసిగూడలలో  విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.

- ఆదివాసి సంఘాల నాయకుల విమర్శ.

 గిరిజన గ్రామాలను సందర్శించిన ఆదివాసి నాయకులు.


Scv News Kasiprt:--

 కాసిపేట మండలంలోని ఆదివాసి గ్రామాలలో విష జ్వరాలు విదృంభించడానికి  వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని   విమర్శిస్తున్నారు. ఈ రోజున  దేవాపూర్, గట్రాపల్లి, సాలెగూడం, పెద్దాపూర్ పెద్దగూడెం, సోనాపూర్, నాయకపు గూడెం  గ్రామాలలో ఆదివాసి సంఘాల నాయకులు సందర్శించి జ్వర పీడితులను పరామర్శించారు. విష జ్వరాలను అరికట్టేందుకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం లేదని  జ్వరాల సర్వే కూడా సరిగా చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు . విది నిర్వహణలో ఇంటింటికి వెళ్లి మందులు కానీ పరీక్షలు కానీ చేపట్టాలి కానీ అలాంటివే జరగడం లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఆదివాసి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుంటున్నారు. దీన్ని ఆదివాసి సంఘాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి, ఇకనైనా హెల్త్ డిపార్ట్మెంట్ వారు మేల్కొని వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆదివాసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదివాసి గ్రామాలను సందర్శించిన వారిలో  ఆదివాసీ నాయకులు  ఆత్రం జంగు, కొడప జయరాం,కడప లింగు,పంద్రం  సింగు, కనక లక్ష్మణ్,  సీడం  తరుణ్ లు వున్నారు.