కాసిపేట మండలంలో ఘనంగా77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
![]() |
| కాసిపేట మండల కేంద్రంలో జెండాను ఎగురవేస్తున్న తహసిల్దార్ వేణుగోపాల్. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ వేణుగోపాల్, మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ రొడ్డ లక్ష్మి, ధర్మారావుపేట సహకార బ్యాంకు కార్యాలయం ముందు సింగిల్విండో చైర్మన్ బడావత్ నీల జాతీయ జెండాను ఎగరవేశారు. ధర్మ రావు పేట రైతు వేదిక వద్ద బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, కాసిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రత్నం ప్రదీప్, చిన్న ధర్మారం గ్రామంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ కుమార్, సాలె గూడెం రాయి సెంటర్ కార్యాలయంలో సర్ మేడి మేస్రం మహదు, జాతీయ జెండాను ఎగురవేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచులు, ప్రభుత్వ పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు జెండాలను ఆవిష్కరించారు.స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేవాపూర్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థినిలు వివిధ కళా ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
దేవాపూర్ లో మండల కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. ప్రథమ బహుమతి గొల్లవాడ జట్టు ద్వితీయ బహుమతి అచ్యుత రావు జట్టు గెలుచుకున్నాయి. దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు బహుమతులు ప్రధానం చేశారు.
మండల కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మండల జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, ఎంపీడీవో ఎంఏ అలీ, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రం రావు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్, పలు గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు మండల బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




