ఉస్మానియా యూనివర్సిటీలో సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన సర్పంచి వేముల కృష్ణ.

ఉస్మానియాలో సీట్ సంపాదించిన కొత్తసూర్య శ్రీని శాలువాతో సన్మానిస్తున్న పెద్దనపల్లి సర్పంచి వేముల కృష్ణ.
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి పంచాయతీ పరిధిలోని న్యూ కాలనీకి చెందిన విద్యార్థిని కొత్త సూర్య శ్రీ ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సరం సీటు సాధించడంతో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచి వేముల కృష్ణ విద్యార్థిని సత్కరించి అభినందించారు. మొదటినుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ, యూనివర్సిటీలో సీటు సాధించడం గొప్ప విషయం అని, అన్నారు. ఉన్నతంగా చదువుకొని, తల్లిదండ్రులకు గ్రామానికి, పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్త రమేష్, చంద్రయ్య, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.