తెలంగాణ ఉద్యమకారులకి పెన్షన్లు మంజూరు చేయాలి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారికి పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్న ఉద్యమకారులు.
Scv News Kasipet:--
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయాలని బెల్లంపల్లి కాసిపేట మండల ఉద్యమకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లి వచ్చిన సోమ గూడెం జేఏసీ కన్వీనర్ దుర్గం గోపాల్, కాసిపేట మండల ఉద్యమకారులు రామటెన్కి వాసుదేవ్, కలవల శరత్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో చాలామంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వందలాది కేసులతో జైలుకు వెళ్లి ఎన్నో అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ప్రత్యేక తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఉపాధి లేక కుటుంబాలను పోషించు కోలేని స్థితిలో ఉన్నారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇచ్చిన మాదిరిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ కూడా ఉద్యమకారులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.