మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

విద్యార్థులకు చేయూత అందించిన కాసిపేట సర్వే డిపార్ట్మెంట్

 విద్యార్థులకు చేయూత అందించిన కాసిపేట సర్వే డిపార్ట్మెంట్.

 పుస్తకాలు పెన్నులు అందజేస్తున్న కాసిపేట సర్వే సిబ్బంది.



Scv News Kasipet:--

 మందమర్రి ఏరియా  కాసిపేట గని సర్వే డిపార్ట్మెంట్ వారు "చేయూత" స్వచ్ఛంద సంస్థ ను ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుక బడిన గిరిజన ప్రాంతాల్లో ని విద్యార్థులకు చేయూత నందించారు. సామజిక బాధ్యతగా స్వచ్ఛంద గా ముందుకు వచ్చి ముత్యం పల్లి పంచాయతీలోని గుండ్ల పహాడ్ గ్రామంలో  విద్యార్థులకు పుస్తకాలు, పలకలు,పెన్నులు,బట్టలను అందించారు.వారికి మౌళిక వసతులు కల్పించడం వల్ల పిల్లలు జ్ఞానవంతులై రేపటి సమాజాన్ని తీర్చబడేవారిగా తయారు అవుతారని ముఖ్య అతిథి సర్వేయర్ వెంకటేశ్వరరావు అన్నారు.సమాజానికి కొంత ఉపయోగపడడం వల్ల జీవితం దాన్యమవుతుందని జూనియర్ సర్వేయర్ ఖాన్ అన్నారు.సర్వే డిపార్ట్మెంట్ వారు పే బ్యాక్ చేయడం,విద్యార్థులకు జ్ఞానం అందించాలని చేయుత అందించడం అభినందనీయమని బన్న లక్ష్మన్ దాస్ అన్నారు. విద్యార్థులకు అండగా నిలవడం గొప్ప అనుభూతిని కలిగించిందని ఆడెపు రవి  అన్నారు.ఈ కార్యక్రమంలో అంకం రాజమల్లు, మోహన్,ఆనంద్,గణేష్,ఆంజనేయులు, షకీల్,ప్రవీణ్,సర్వే సిబ్బంది పాల్గొన్నారు.