మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తాలో గా సర్వాయి పాపన్న జన్మదినోత్సవ కార్యక్రమం

 ఘనంగా కాసిపేట మండలంలో  సర్వాయి పాపన్న గౌడ్ 373 వ  జయంతి.

 కొండాపూర్ చౌరస్తాలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవం లో పాల్గొన్న గౌడ కులస్తులు.

Scv News Kasipet:- 

 మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తాలో ఈరోజు మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి మండల గౌడ సంఘం అధ్యక్షుడు మార్క శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పోడేటి రాజా గౌడ్, ఉపాధ్యక్షులు భాస్కర్ గౌడ్, పడాల మల్లేష్ గౌడ్, ముఖ్య సలహాదారు తాటిపాముల శంకర్ గౌడ్, నేరెళ్ల బుగ్గయ్య గౌడ్ పల్లె మల్లయ్య గౌడ్, కోడూరి గురువయ్య గౌడ్ బుర్ర లింగ గౌడ్ లు పూలమాలలు వేశారు.

 ఈ సందర్భంగా  సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు మండల గౌడ సంఘం ముఖ్య సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా గౌడ సోదరులు తమ శక్తిని గుర్తించు కోవాలని, రాజకీయ నాయకుల వద్ద  అడుక్కోవడం మానేసి రాజ్యాధికారం పై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న సామాన్య గౌడ కుటుంబంలో పుట్టి బహుజన రాజ్యాన్ని స్థాపించి 30 ఏళ్లు పరిపాలించాడన్నారు. దేశంలో రెండు వేల సంవత్సరాలుగా  మనుధర్మ శాస్త్ర ప్రకారం చాతుర్వర్ణ సిద్ధాంతం ఆధారంగా పరిపాలన సాగిందని గుర్తు చేశారు. క్షత్రియుడే రాజ్యమేలాల ని సూత్రాన్ని పాతరేసి శూద్ర కులానికి చెందిన  గౌడ బిడ్డ సర్వాయి పాపన్న రాజ్యాన్ని ఏలాడన్నారు. మనువాద బ్రాహ్మణ వర్గం ముందు తరాలకు శూద్రుడు రాజ్యమేలాడు అన్న విషయం తెలవకుండా పాపన్న చరిత్రను కనుమరుగు చేశార న్నారు.  బ్రిటిష్ చరిత్రకారుడు ఏకే బోయర్ కృషి వల్ల పాపన్న చరిత్ర బాహ్య ప్రపంచానికి తెలిసిందని గుర్తు చేశారు. బ్రిటిష్ వారి లండన్ విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో   పాపన్న చరిత్ర భద్రపరిచారని దాని ఆధారంగానే నేడు విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటు న్నామని అన్నారు. 

బహుజన వర్గాలమంతా  ఐకమత్యంతో ఉండి రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలని అన్నారు. తెలంగాణలో 18 గౌడులు అసెంబ్లీలో 25 నుండి 30 శాతం సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు 0.5 శాతం ఉన్న వెలమలు, 5 శాతం ఉన్న రెడ్లు పరిపాలనలో కీలకంగా వ్యవహరిస్తుంటే 52 శాతం ఉన్న బీసీలు వాళ్లను సీట్లు అడుక్కునే స్థితిలో ఉండడం దారుణం అన్నారు. బీసీ సంఘాలన్ని ఐక్యమై రాజ్యాధికార దిశగా పయనించాలని పిలుపు నిచ్చారు.


మండల గౌడ సంఘం అధ్యక్షుడు మార్క శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మండలంలోని గౌడ కులస్తులమంతా ఐకమత్యంతో సంఘాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. సర్వాయి పాపన్న ఆశయాల మేరకు గౌడులంతా ఏకం అవ్వాలని కోరారు.

గౌడ సంఘం యూత్ కమిటీ అధ్యక్షుడు  కొయ్యడ అంజన్న గౌడ్ మాట్లాడుతూ మండలంలో  సర్వాయి పాపన్న  జయంతి కార్యక్రమానికి అన్ని గ్రామాల నుండి గౌడ సోదరులు హాజరు కావడం సంతోషకరమని అన్నారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి పోడేటి రాజా గౌడ్, సలహాదారులు కోడూరు గురువయ్య లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో   కొండాపూర్ ఉప సర్పంచ్ సుమన్ గౌడ్ , కోనూరు మాజీ సర్పంచ్ బందెల ప్రేమ్ కుమార్,మండల జాయింట్ సెక్రెటరీ తాటిపాముల రాజ గౌడ్, కోశాధికారి శేఖర్ గౌడ్, మండల యూత్ కమిటీ నాయకులు రంగు శ్రావణ్ గౌడ్, బుర్ర ప్రకాష్ గౌడ్, నేరెల్లి నర్సింగంగౌడ్, నేరెల్లి రవి గౌడ్, బొల్లపల్లి సత్యనారాయణ గౌడ్, నేరెళ్ల తిరుపతి గౌడ్  మండల గ్రామ కమిటీల నాయకులు పాల్గొన్నారు.