ఘనంగా ఆదివాసి నేత అమరుడు రోడ్డ చిన్న రమేష్ మూడవ వర్ధంతి.
![]() |
| ఆదివాసి నేత అమరుడు రోడ్డ చిన్న రమేష్ నివాళులర్పిస్తున్న నాగపూర్ సేవా సంఘ సభ్యులు కుటుంబ సభ్యులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండల నాయక్ పోడ్ సేవా సంఘం నాయకుడు దేవాపూర్ నాయక గూడెం గ్రామానికి చెందిన రోడ్డ చిన్న రమేష్ మూడో వర్ధంతి కార్యక్రమం నాయక్ పోడు సేవా సంఘం,కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. రొడ్డ చిన్న రమేష్ మండలంలోని ఆదివాసుల, బహుజన వర్గాల సమస్యలపై ఉన్న ఉద్యమాలలో పాల్గొన్నాడు.
దేవాపూర్ నాయకపుగూడ గ్రామం లో ఆదివాసీ నాయకపొడ్ ఆచార సాంప్రదాయాల ప్రకారం, చిన్న రమేష్ విగ్రహం వద్దకు వెళ్ళి, కుటుంబ సభ్యుల చేత పూజ కార్యక్రమం నిర్వహించి, ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నాయక్ పోడ్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి తట్ర భీమారావు, కోశాధికారి కొమ్ముల బాపు, మద్దిమడ సర్పంచ్ అడే జంగులు రోడ్డ చిన్న రమేష్ ఆదివాసుల కోసం చేసిన సేవా కార్యక్రమాలు ఉద్యమాల గురించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ సేవ సంఘం మండల కమిటీ అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు కనక రాజు, కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్, కోశాధికారి రోడ్డ రవీందర్,గ్రామ పెద్ద రోడ్డ రాజయ్య,గడ్డం భీమయ్య,కలవెని శ్రావణ్ తదితరులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయడం జరిగింది.

