మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట గనిలో గుండెపోటుతో మరణించిన మార్త రమేష్ కుటుంబానికి చెక్కు పంపిణీ.

 కాసిపేట గనిలో గుండెపోటుతో మృతి చెందిన మార్త రమేష్  కుటుంబానికి చెక్కు ల పంపిణీ.

 మార్త రమేష్ భార్యకు చెక్కులు అందజేస్తున్న గని మేనేజర్ అల్లావుద్దీన్.
Scv News Kasipet:--

 మందమర్రి ఏరియా కాసిపేట గని లో జనరల్ మాజ్దుర్ గా పని చేసిన మార్త రమేష్  గుండెపోటుతో  గత సంవత్సరం మృతి చెందాడు. రమేష్ కుటుంబానికి రూ.7.78 లక్షల  మరియు రూ.  7.50 ఫిక్సిడ్ డిపాజిట్ లు మొత్తం 15 లక్షల 28 వేల చెక్కులను మేనేజర్ అల్లావుద్దీన్ మృతుని భార్య మార్త సంధ్య కు ఈరోజు  గని ఆవరణలో కార్మికుల సమక్షంలో అందచేయ డం జరిగింది.

ఈ సందర్భంగా మేనేజర్ అల్లావుద్దీన్  మాట్లాడుతూ ప్రతి క్షణం ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలని, మనం ఆరోగ్యం గా ఉంటే కుటుంబం బాగుంటుందని,సంస్థ బాగుంటుందని అన్నారు. TBGKS నాయకులు రాజన్న మాట్లాడుతూ TBGKS వల్లనే 15 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.AITUC పిట్ సెక్రటరీ  నారాయణ మాట్లాడుతూ రమేష్ పనిలో ఎప్పుడు చురుగ్గా ఉండేవాడని ఆకస్మిక గుండెపోటు తో మరణించడం బాధాకరమని అన్నారు.

ఈకార్యక్రమంలో TBGKS ఫిట్ కార్యదర్శి బైరి శంకర్,బన్న లక్ష్మన్ దాస్,లింగయ్య,సతీష్, రాజేందర్, అరుణ్,రవి,ఇంజనీర్ బాబు, సంక్షేమాధికారి మీర్జా తదితరులు పాల్గొన్నారు.