కాసిపేట మండలంలో ఘనంగా ఆదివాసి దినోత్సవం.

ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా కొండాపూర్ చౌరస్తాలో కొమరం భీం విగ్రహానికి పూలమాల వేస్తున్న ఆదివాసి నాయకులు. 
సాలె గూడెం గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసిన ఆదివాసి నాయకులు
Scv News Kasipet:--
కాసిపేట మండలంలో వివిధ గిరిజన గూడాలలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసీ గుడాలలో ప్రతి ఒక్క గ్రామంలో పటేల్, రాయి సెంటర్ అధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కొండాపూర్ యాప చౌరస్తా లోని పురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి మండల కేంద్రంలో ఆదివాసి జెండాను ఆవిష్కరించడం జరిగింది. గిరిజన యువతి యువకులు చదువుకోవాలని రాబోయే రోజుల్లో మన హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేయవలసిందిగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ రేపటి తరానికి ఎదగాలని ఆదివాసి నాయకులు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర జిల్లా మండల కమిటీ సభ్యులు రాయి సెంటర్ సభ్యులు, అనుబంధ సంఘాలు,సర్పంచులు, ఎంపిటిసీలు పోలిస్ వ్యవస్థ గ్రామ పటేళ్లు, ప్రజలు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.