కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
-కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ
![]() |
| పంచాయతీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ. |
![]() |
| పంచాయతీ కార్మికులకు భోజనాలు వడ్డిస్తున్న మండల కాంగ్రెస్ నాయకులు. |
Scv News Kasipet:--
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్న పంచాయతీ కార్మికులు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నెల రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం, దొర అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేములు కృష్ణ అన్నారు. కాసిపేట మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ అధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపి, కార్మికులకు మధ్యాహ్న భోజనాన్ని చేయించి వడ్డించారు. ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ. కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారం అయ్యే వరకు తమ వంతుగా పోరాటాలు చేస్తామని అన్నారు. 2021లో ప్రకటించిన జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్దం తిరుపతి,యస్ సి సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి, నాయకులు మైదం రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు జాడి శివ,ఏల్పూల వెంకటేష్,ప్రౄధ్వీ తదితరులు పాల్గొన్నారు.

