మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ముగిసిన కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర.

 50 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న పల్లె పల్లెకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర.

- ఆరు రోజులుగా 50 గ్రామాలు మీదుగా కాసిపేట మండల పాదయాత్ర ముగింపు.

- అధ్యక్షులు వేముల కృష్ణ




Scv News Kasipet:--

కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో గత వారం రోజులుగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వ హించిన కాంగ్రెస్ పల్లె పల్లె కు పాదయాత్ర ఈరోజుతో ముగిసింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ మాట్లాడుతూ వారం రోజులుగా 50 గ్రామాల మీదుగా 50 కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేసినట్లు  తెలిపారు.కాసిపేట మండలం ముగింపు పాదయాత్ర ను పెద్దనపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్న తరుణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో సామాన్యులు అనేక ఇబ్బందుల ను ఎదుర్కొంటు న్నారని, ఏ గ్రామాల్లో చూసిన వితంతులకు పింఛన్ రాక, ఉన్న భూములను ధరణి పేరిట దొరలు దోచుకున్నా రని ఆరోపించారు. నూతనంగా వివాహం చేసుకొని ఏళ్లు గడుస్తు న్న రేషన్ కార్డు లేక ప్రభుత్వం వచ్చే పథకాలకు దూరం అవుతు న్నారని అన్నారు. సాధించుకున్న రాష్ట్రాన్ని రాబందులు పాలిస్తున్నా రని, 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పింఛనిద్దామని ఆమె ఇచ్చిన కేసీఆర్ హామీని విస్మరించారని ఎదేవా చేశారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము అమలు చేసే పథకాలను ప్రజలకు వివరించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రోడ్డు శారద, నాతరి స్వామి, ధర్మారావు పేట ఎంపిటిసి పార్వతి మల్లేష్, రాష్ట్ర ఓబిసి సెల్ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు బాకం మల్లేష్, జయరాం,మాజి సర్పంచ్ జాడి శంకర్, యస్ సి సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి, మైనారిటీ సెల్ షాకీర్, సీనియర్ నాయకులు గౌస్,  మైదం రమేష్,జాడి శివ, మహాకాళి, చారి, వార్డు సభ్యులు కొత్త రమేష్ పంబాల తిరుపతి, బన్న హిందుమతి, కంచర్ల పద్మ, నాయకులు జంపన్న, శ్రీనివాస్, శ్రీధర్, మహేష్ లు తదితరులు పాల్గొన్నారు.