మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తహసిల్దార్ కు తుడుం దెబ్బ మండల కమిటీ సన్మానం.

తహసిల్దార్ కు తుడుం దెబ్బ మండల కమిటీ సన్మానం.

  కాసిపేట  తహసిల్దార్ వేణుగోపాల్ ను సన్మానిస్తున్న తుడుం దెబ్బ మండల కమిటీ.

Scv News Kasipet:--

మంచిర్యాల జిల్లా కాసిపేట మండల రెవెన్యూ కార్యాలయానికి  బదిలీపై వచ్చిన తహసిల్దార్  వేణుగోపాల్ మరియు మాణిక్ రావ్ DT ని ఈరోజు కాసిపేట మండల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ  కమిటీ కార్యవర్గం శాలువాలతో సన్మానం చేసింది. ఈ సందర్భంగా తుడుం దెబ్బ నాయకులు  మండలంలోని ఆదివాసి రైతులకు సంబంధించిన భూసమస్యల ను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఆదివాసులకు అండగా నిలిచి అన్యాయం జరగకుండా చూడాలని తాహసిల్దార్ వేణుగోపాల్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సోయం జంగు రాష్ట్ర కార్యదర్శి,మడవి వెంకటేష్ ప్రధాన కార్యదర్శి. పెంద్రం శంకర్, ఆత్రం సంజీవ్ ఉపాధ్యక్షులు, పెంద్రం ప్రభాకర్ కోశాధికారి, మడవి గంగారాం సలహాదారు, ఆత్రం మహేష్ సహాయ కార్యదర్శి, చిక్రం రాందాస్ పటేల్ పాల్గొన్నారు.