మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తుడుం దెబ్బ మండల కమిటీ రద్దు పై కమిటీ సభ్యులు అత్యవసర సమావేశం.

 తుడుం దెబ్బ మండల కమిటీ రద్దు పై  కమిటీ సభ్యులు అత్యవసర సమావేశం.



Scv News Kaspet:--

 కాసిపేట మండలం కొండాపూర్ యాపలో ఈరోజు తుడుం దెబ్బ మండల కమిటీ సభ్యుల అత్యవసర సమావేశం జరిగింది. తుడుం దెబ్బ జిల్లా కమిటీ నాయకులు తమ ఆదేశాలను మండల కమిటీ నాయకులు పాటించడం లేదని ఇటీవల మండల కమిటీని రద్దు చేశారు. దీనిపైన సమావేశమైన మండల కమిటీ నాయకులు  జిల్లా కమిటీ నాయకులు ఏకపక్ష నిర్ణయంతో మండల కమిటీని రద్దు చేయడం సబబు కాదని ఈ విషయంలో రాష్ట్ర కమిటీ నాయకులు కూడా చొరవ చూపి  వివాదాలను పరిష్కరించి మండల కమిటీ పునరుద్ధరించాలని తీర్మానించారు.

ఈ సమావేశంలో  మండల కమిటీ ప్రధాన కార్యదర్శి మడావి వెంకటేష్  రాయి సెంటర్ సర్ మేడి మెశ్రమ్ మహదు, ఉపమేడి కొమరం జనార్ధన్, గీతాదర్ సిడం గణపతి, మండల కమిటీ సభ్యులు పెంద్రం  ప్రభాకర్, పింద్రం శంకర్, ఆత్రం సంజీవ్, వుయిక  మొతిరం, మెశ్రమ్ భీమ్రావు, పెంద్రం శేఖర్, ఆత్రం మహేష్ మెశ్రమ్ భీమ్రావు, సెట్మా కి రాదా మడవి గంగారాం, మడవి రాము సిడం  మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.