మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేశంలోబహుజనులను ఐక్యం చేసేందుకు నూతన 21వ శతాబ్దపు (m21) జాతీయ సామాజిక ఉద్యమం .


 పూలే,అంబేద్కర్ భావజాల  సైద్ధాంతిక పునాదితో రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు లోబడి ఉద్యమం ప్రారంభం. 

వివక్షకు గురవుతున్న  రైతులు, యువత,మహిళల భాగస్వామ్యం తో గ్రామ పునాదుల నుండి దీర్ఘకాలిక ఉద్యమ నిర్మాణం.

- గత బహుజన ఉద్యమాల వైఫల్యాలను విశ్లేషించి వాటి అనుభవాలతో  శాస్త్రీయ పద్ధతిలో  సమిష్టి ఉద్యమ నిర్మాణం .

- ప్రత్యామ్నాయ బహుజన సంస్కృతిని రూపొందించడం.

 21వ శతాబ్ద ఉద్యమం M 21 లోగో

 నాగపూర్  డిగ్నిటీ ఫెస్టివల్ లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు.


డిగ్నిటీ ఫెస్టివల్ లో పాల్గొన్న తెలంగాణ M21 బృందం 

Scv News Kasipet --:

 దేశ జనాభాలో  85 శాతం ఉండి, 15% ఉన్న అగ్రవర్ణాల వివక్షలకు గురవుతున్న బహుజన వర్గాలను సమీకరించి బహుజన రాజ్య స్థాపన కోసం దీర్ఘకాలిక నూతన జాతీయ బహుజన  21వ శతాబ్దం ( m 21)  ఉద్యమం ప్రారంభ మైంది.  పూలే, అంబేద్కర్ భావజాల సైద్ధాంతిక  పునాదిగా రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు లోబడి   దేశంలోని బహుజన వర్గాలకు చెందిన మేధావి వర్గం నూతన 21వ శతాబ్ద  ( m 21) ఉద్యమానికి రూపకల్పన చేశారు.  ఈ ఉద్యమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన బహుజన మేధావి వర్గం  యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఐఏఎస్ అధికారులు, న్యాయవాదులు,  ఐటి నిపుణులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. బహుజన మేధావి వర్గం 2017లో నాగపూర్ లో సమావేశమై  దేశంలో స్వాతంత్రం అనంతరం వచ్చిన బహుజన ఉద్యమాల వైఫల్యాల కు గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించారు.

 వర్తమాన బహుజన ఉద్యమాలలో వీరు గుర్తించిన ప్రధాన లోపాలు ఇవి..

- సంస్థలు వ్యక్తి ఆధారిత నిర్మాణమై ఉండడం

- సంస్థాగతమైన  క్రియాశీ లత లోపించడం.

- నూతన నైపుణ్యత కలిగిన ప్రతిభను గుర్తించి ఉపయోగించు కోలేకపోవడం.

- ప్రభుత్వ ఉద్యోగుల మీద అతిగా ఆధారపడడం.

- సమాజంలో గల సామాజిక భిన్నత్వం అంటే సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులను ( SEBC) ఐక్యం చేయడంలో విఫలమవ్వడం.

- వీటితో పాటు సామాజిక మాధ్యమాలను, యువత యొక్క సాంకేతిక సామర్థ్యానికి దూరం అవడం లాంటివి  ఉద్యమాలు విఫలం అవ్వడానికి  ముఖ్య కారణాలుగా గుర్తించారు. ఈ అంశాలన్నింటినీ పునః పరిశీలన జరిపి పూలే అంబేద్కర్ భావజావ పరిధిలో SEBC ల కొత్త తరానికి ఒక నూతన m21 ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం గత ఐదు సంవత్సరాలు గా దేశంలోని వివిధ రాష్ట్రాలలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,ఛత్తీస్గఢ్ ఆంధ్ర,తెలంగాణ, కర్ణాటక లతో పాటు సుమారు పది రాష్ట్రాలలో నిర్మాణపరమైన పనులు చేసింది.  మహారాష్ట్ర,చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకొని  ప్రయోగాత్మకంగా  గ్రామస్థాయిలో బలమైన బహుజన ఉద్యమ నిర్మాణాలు చేపట్టింది. ఈ సంవత్సరం 2023  మే 7వ తేదీన నాగపూర్ లో   'డిగ్నిటీ ఫెస్టివల్ ' జరుపుకొని  గ్రామస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి  వెళ్లి ఉద్యమ నిర్మాణం చేసేందుకు ముందుకు వచ్చింది. తెలుగు ఉభయ రాష్ట్రాలలో  అంబేద్కర్ పూలే భావజాలంతో ఉన్న విద్యార్థి, యువత, మహిళల మేధావులను సమీకరించి గ్రామస్థాయిలో  ఉద్యమాన్ని  నిర్మాణం చేసేందుకు ' M 21' నాయకత్వం కృషి చేస్తుంది. 

దేశంలో m 21 ఉద్యమ అవసరాలు ఎందుకు?

భారతదేశంలో అపారమైన సహజ వనరులు, ఖనిజ సంపద, సారవంతమైన భూములు, జీవనదులు  పుష్కలంగా ఉండి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడుస్తున్న  ప్రపంచ దేశాలలో అభివృద్ధిలో వెనుకబడే ఉన్నాము. మన దేశం అన్ని రంగాలలో  వెనుకబడి ఉందనడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం వెల్లడిస్తున్న గణంకాలే ప్రత్యక్ష నిదర్శనం.

ఈ దేశంలోని 85 శాతం ఉన్న మెజారిటీ ప్రజలైన బహుజన వర్గాలు నేటికీ  అర్ధాకలితోనే అలమటిస్తూన్నాయి. ఆ వర్గాలకు సరైన విద్యా, వైద్యం,ఉపాధి లభించక  దారిద్రంలోనే జీవితాలను కొనసాగిస్తు న్నారు. దేశంలో 15% ఉన్న అగ్రవర్ణా లు రాజ్యాధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని రాజ్యాంగపరంగా బహుజన వర్గాలకు దక్కాల్సిన హక్కులను కూడా ఇవ్వకుండా అణిచివేతకు గురి చేస్తూ పాలిస్తున్నాయి. బహుజన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి వివక్షలకు గురవుతూనే ఉన్నారు. బహుజన వర్గాల అభివృద్ధి, సామాజిక రక్షణ కోసం, స్వేచ్ఛ స్వాతంత్రం, సోదర భావం నెల కోల్పేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులను కల్పించాడు. వాటిని సక్రమంగా అమలు చేయకుండా   మనువాద భావజాలంతో ఉన్న  పాలకులు మొత్తం రాజ్యాంగాన్ని  మార్చి బ్రాహ్మణ రాజ్యాంగమైన  మనుస్మృతిని  తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది.  దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ పాలన కోన సాగించేందుకు కుట్రలు చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో బహుజన వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారం దిశగా తీసుకు వెళ్లేందుకు  21వ శతాబ్దం(  M 21) జాతీయ ఉద్యమ అవసరం ఎంతైనా ఉంది.

అంబేద్కర్ సిద్ధాంతాన్ని అమలు చేయడంలో దళిత సంఘాలు  విఫలం పట్ల విశ్లేషణ. 

దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత  బాబా సాహెబ్ అంబేద్కర్ మెజారిటీ బహుజన ప్రజలు అధికారంలోకి రావడం కోసం ఓటు హక్కు, రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగంలో ఎన్నో హక్కులను కల్పించారు. బహుజన వర్గాలు అభివృద్ధి చెందాలంటే 'రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యం కావాలని బోధించాడు'. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో 85 శాతం బహుజనులు  'మీ ఓట్లు మీరు వేసుకుంటే చాలు అధికారంలోకి రావచ్చని పిలుపునిచ్చాడు'. అంబేద్కర్ జీవితాంతం బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన అగ్రవర్ణాల కుట్రలు, బహుజన వర్గాల్లో ఐక్యత లోపించడంతో తాను బ్రతికుండగా  బహుజన రాజ్యం సాధించలేక పోయాడు. ఈ దేశంలోని అణగారిన బహుజనుల హక్కుల కోసం తన కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసిన మహనీయ మూర్తి అంబేద్కర్. మనువాద బ్రాహ్మణ కుట్రలో భాగంగా బహుజన వర్గాలన్ని కులాలుగా విడిపోవడం వల్ల ఐక్యత లోపించింది. దీన్ని ఆసరాగా చేసుకుని అగ్రవర్ణాలు బహుజనులను విభజించు- పాలించు సిద్ధాంతంతో అధికారంలోకి రాకుండా స్వాతంత్రం వచ్చిన 76 ఏళ్లుగా వారే పాలకులుగా కొనసాగు తున్నారు.

అంబేద్కర్ తదనంతరం బహుజన రాజ్య స్థాపన కోసం అంబేద్కర్ ఏర్పాటు చేసిన రిపబ్లిక్ రాజకీయ పార్టీ  చీలికలై పోయింది. అంబేద్కర్ అనంతరం కాన్షీరామ్ బహుజన రాజ్య స్థాపన కోసం  దేశంలోని బహుజన వర్గాలను, ఉద్యోగులను సమీకరించి  బామ్ సెప్,బిఎస్పి ద్వారా రాజ్యాధికార దిశగా ప్రయాణించి కొంత విజయం సాధించాడు. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో రాజ్యాధికారం సాధించి మాయావతిని మూడుసార్లు ముఖ్యమంత్రిని చేయగలిగాడు. బహుజన ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసి కేంద్రంలో అధికారం కైవసం చేసుకోవడంలో మాత్రం  సపళీకృతుడు కాలేకపోయారు.

ప్రస్తుతం దేశంలో బహుజన వర్గాలను ప్రభావితం చేసే నాయకులు లేక మనువాద పార్టీల కుట్రలకు బహుజన వర్గాలు చెల్లచెదురయ్యాయి. బిఎస్పీ కూడా రోజు రోజుకు బలహీనపడి ఇటీవల జరిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైంది.

దేశంలో బహుజన వర్గాలు అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలపై 'M 21 ' విశ్లేషణ. 

దేశంలో 85% బహుజన వర్గాలు రాజ్యాధికారంలోకి రాకపోవడానికి గల కారణాలను M21 విశ్లేషణ చేసి పరిష్కారాలను వెతికింది.

 * దేశంలోని  దళిత, బహుజన ఉద్యమాలన్నీ కూడా పట్టణాలకే పరిమితం కావడం, గ్రామాలను విస్మరించడంతో విఫలమ య్యాయి. బహుజనులు 85 శాతం ఉన్న ఓటింగ్ వచ్చేవరకు 10 శాతం మించడం లేదు. మిగతా   75% మంది ప్రలోభాలకు లొంగి  అగ్రవర్ణాలకే ఓటు వేస్తున్నారు . వాళ్లకు వాస్తవ పరిస్థితులు తెలిపి అంబేద్కర్ భావజాలంతో మానసిక పరివర్తన తేవాల్సిన అవసరం ఉందని గుర్తించింది.

*  దేశంలో 75 శాతం గ్రామా లున్నాయి. ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న 70% రైతుల సమస్యలపై ఎవరు పట్టించు కోవడం లేదు. ప్రతి ఏటా వ్యవసాయం గిట్టుబాటు కాక పంటలు సరిగా పండక లక్షలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా బహుజన సంఘాలు పట్టించుకోవడం లేదు.

* దేశ జనాభాలో 130 కోట్ల మంది  ఉన్నారు. వీరిలో 27 సంవత్సరాల లోపు వయసు గల యువకులు 30 శాతం మంది ఉన్నారు. 65 శాతం మంది విద్యార్థులు ఉద్యమాలకు దూరంగా ఉన్నారు. ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో కూడా విద్యార్థులు యువకులు లేకుండా ఏ ఉద్యమం విజయవంతం కాలేదు. బహుజన,  దళిత సంఘాలు విద్యార్థుల ఉద్యమ నిర్మాణం పట్ల నిర్లక్ష్యం చేశాయి.

* జనాభాలో 50 శాతం ఉన్న మహిళలను పట్టించుకోకపోవడం, వారిని ఉద్యమాలలో భాగస్వామ్యం చేయకపోవడం వల్ల బహుజన, దళిత సంఘాలు విజయవంతం కాలేకపోయాయి.

* బాబా సాహెబ్ అంబేద్కర్  విద్యా,ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందిన  ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు తన తోటి బహుజనులకు సహకరించాలని ఆశించారు. కానీ అలా జరగలేదు. రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు 80 శాతం మంది బహుజన దళిత ఉద్యమాలకు  సహకరించకుండా తమ కుటుంబాలకే పరిమితం  అయ్యారు. వీరందరితో ఉద్యమాలకు ఆర్థిక సహాయంతో పాటు భాగస్వామ్యం చేయడంలో బహుజన, దళిత ఉద్యమాలు విఫలమయ్యాయి అని గుర్తించింది.  గతంలోని బహుజ దళిత ఉద్యమాలు విస్మరించిన వాటిని గుర్తించి  అనుభవాలతో  సమస్యలన్నీ శాస్త్రీయంగా విశ్లేషించిన పరిష్కారాలను చూపెట్టే విధంగా భవిష్యత్తులో బహుజన రాజ్య స్థాపన కోసం బహుజన  మేధావి వర్గం  21వ శతాబ్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి.

M21 ఉద్యమ లక్ష్యాలు, ముఖ్య సూత్రాలు. 

స్వేచ్ఛ,సమానత్వం, సోదరా భావంతో రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు లోబడి  పూలే,అంబేద్కర్ ఆలోచనల సైద్ధాంతిక  పునాదితో గ్రామస్థాయి నుండి రైతులు, విద్యార్థి యువకులు మహిళలతో దీర్ఘకాలిక ఉద్యమాన్ని నిర్మాణం చేయడం.

* గత ఉద్యమాలన్నీ భావోద్వేగాలతో నిర్మాణం చేయడం వల్ల మధ్యలోనే ఆగిపోయాయి.

* సమిష్టి నిర్ణయాలు ఆలోచనలతో కొత్త ఉద్యమాన్ని ప్రారంభించడం.

*  మారుతున్న కాలానికి అనుగుణంగా సమస్యలను గుర్తించడం వాటి పరిష్కార మార్గాలను వెతుకుతూ ప్రజల భాగస్వామ్యంతోనే  ఉద్యమాలను నిర్మించడం.

* అంతర్గత ప్రజాస్వామ్యం, సంఘటిత నాయకత్వం, సమిష్టిమిదో మధనం

 * యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే యువ సంస్థ, యువత ఆకాంక్షలను నెలకొల్పడం.

* లింగ,సామాజిక, మత,ప్రాంత, భాషా, వయస్సు, నైపుణ్యం మొదలగు వైవిధ్యం భిన్నత్వం పట్ల ఖచ్చితమైన స్పష్టత .

* నైతిక నడత,వృత్తి నైపుణ్యపరంగా ఉపయోగించు కోవడం, రాజ్యాంగ శిరోధార్యమే.

* ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇవే తరహా అంచివేత వ్యతిరేక ఉద్యమాలకు వారధిగా వ్యవహరించడం.

* సోషల్,కల్చర్, స్టూడెంట్స్ అగ్రికల్చర్, వర్క్ ఫోర్సు ఇంటర్నేషనల్ తదితర మొదలగు ఫ్రంట్ సహకారంతో SEBC సమస్యలపై సంపూర్ణ పరిష్కారం.

* ఉద్యమానికి వెన్నుదన్నుగా సహకరించేందుకు మేధావులతో కూడిన థింక్ ట్యాంక్, టెక్నాలజీ,ఫైనాన్స్, ఆర్ట్స్ మీడియా, న్యాయం సొంత ఇంటలిజెన్స్ మొదలగు సర్వీసులు పనిచేస్తాయి.

M 21 ఉద్యమకారుల ఎంపికలో తగు జాగ్రత్తలు.

దేశవ్యాప్తంగా m 21 జాతీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కొత్త తరహా పద్ధతులను పాటిస్తుంది. గత బహుజన ఉద్యమాలు విఫలం కావడానికి కార్యకర్తలకు నాయకులకు అంబేద్కర్, పూలే ఆలోచనల మీద సరైన అవగాహన లేకపోవడం, అంకితభావంగా  పని చేయకుండా అంబేద్కర్ వాదాన్ని తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకోవడం వల్ల ముందుకు వెళ్లలేదని M 21 గుర్తించింది. అందరినీ ఉద్యమంలోకి తీసుకోకుండా అంబేద్కర్,పూలే భావజాలంతో సమాజంలో నిజాయితీగా బహుజన ఉద్యమం కోసం పనిచేసే కార్యకర్తలను, నాయకులను ఎంపిక చేసుకుంటుంది. ముందు వారికి ఉద్యమా లక్ష్యాలను పరిచయం చేసేందుకు పరిచయ సభలో  (ఇంట్రడక్షన్ )సమావేశానికి ఆహ్వానించి ఉద్యమాన్ని పరిచయం చేస్తుంది. తరువాత ఉద్యమ లక్ష్యం నచ్చినవారు  ఉద్యమంలో పని చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారిని ఎంపిక చేసుకొని శిక్షణ కోసం ( ఇండక్షన్)   సమావేశానికి ఆహ్వానించి ఉద్యమాన్ని తీరుతెన్నులు  సంపూర్ణంగా వివరించి కార్యకర్తలుగా తీసుకుంటుంది.

ఉద్యమానికి ప్రధానంగా ఏ ఒక్క వ్యక్తి నాయకత్వం కానీ అధ్యక్షుడు, కార్యదర్శులు లేకుండా అందరినీ సమాన బాధ్యతతో సమిష్టి నాయకత్వంలో పనిచేయడం ఈ ఉద్యమ యొక్క  ప్రత్యేకత.

ప్రస్తుతం దేశంలో సంగ్ పరివార్ పరిపాలనలో విద్వేష వాతావరణం నెలకొంది. గుజరాత్, మణిపూర్, హర్యానా లాంటి రాష్ట్రాలలో  కులాలు, మతాల పేరిట జరిగే హింసకాండను ప్రభుత్వమే దగ్గరుండి ప్రోత్సహించడం జరుగుతుంది.  వారి అరాచకాలకు దేశంలో  అడ్డు లేకుండా పోయింది.

ఇలాంటి తరుణంలో దేశ సుస్థిరత కోసం  మెజార్టీ వర్గాలైన బహుజనులను ఐక్యం చేసి సంపూర్ణ న్యాయం జరగాలంటే పూలే  అంబేద్కర్ భావజాలంతో  నూతన ఉద్యమం అవసరం ఎంతైనా ఉంది. పూలే అంబేద్కర్ భావజాలంతో ఉండి నిజాయితీగా అంకితభావంతో పనిచేసే ఉభయ తెలుగు రాష్ట్రాలలోని  బహుజన వర్గాలకు చెందిన మేధావులు, విద్యార్థులు, యువకులు  ఈ ఉద్యమంలో చేరి బహుజన రాజ్యా స్థాపన కోసం తమ వంతు కృషి చేయాలని  21వ శతాబ్దపు  ఉద్యమ  సంస్థ   కోరుతుంది.