మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కబ్జాల కే కాదు,లైంగిక వేధింపులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కొండాపూర్ యాప .

 మహిళలపై లైంగిక  వేధింపులు చేశారంటూ అధికార పార్టీ  ప్రజాప్రతినిధులు , నాయకులు పంచాయితీల పేరిట  వసూళ్ల దందా....

 ఇటీవల మాజీ ప్రజా ప్రతినిధి కొడుకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని  1.5 లక్షలు వసూలు. 

భూ అక్రమణలను అడ్డుకున్న వారే లేరు 

- గ్రామ దేవత పోచమ్మ గుడి ముందు వెనక భూ ఆక్రమణ.

- రోడ్లమీద అక్రమ నిర్మాణాల వద్ద నాయకులు లక్షల్లో వసూలు.

- మండల ప్రముఖ ప్రజా ప్రతినిధి రహదారిపై భూమిని పట్టా ఉందని 70 వేలకు విక్రయం.

 - రోడ్ల ఆక్రమణ, మురికి కాల్వలో ఆక్రమణతో  వర్షపు నీరు రహదారిపై కి వచ్చి  పెద్ద పెద్ద గుంతలు

 గుంతలతో గత రెండేళ్లుగా ప్రజలు అవస్థలు పడుతున్న పట్టించుకోని పాలకులు..

 - అక్రమ దందాలన్నీటికీ అధికార పార్టీ నాయకులే సూత్రధారులని గ్రామస్తుల ఆరోపణ.

-  పట్టించుకోని ప్రభుత్వ అధికారులు అవస్థలో కొండాపూర్ గ్రామస్తులు.






Scv News Kasipet:--

 మహిళలపై లైంగిక వేధింపులకు భూ కబ్జాలకు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప కేరాఫ్ అడ్రస్ గా మారింది. లైంగిక వేధింపులు భూ కబ్జాలతో కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప చౌరస్తా మారుమోగుతుంది. ఈ ఘటనలపై ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సరిగా స్పందించడం లేదని తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల కొండాపూర్ చౌరస్తాలో ని యాప కేంద్రంలో ఒక వ్యాపారి  తల్లిదండ్రులు లేని అనాధ  మైనర్ గిరిజన బాలిక ను పనిమనిషిగా పెట్టి  కొన్ని నెలలుగా పని చేయించు కుంటున్నడు.ఇటీవల బాలిక అస్వస్థతకు గురైంది.  అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి వ్యాపారిని బెదిరించి బాలికను లైంగిక వేధింపులు చేసి గర్భవతి చేసావ్ అంటూ  బ్లాక్ మెయిల్ చేసి  పంచాయతీ పెట్టి రెండు లక్షలు తీసుకున్నట్టు  ప్రచారం జరిగింది. బాలిక కుటుంబానికి  కొంత ముట్ట చెప్పి  మిగతాది నాయకులు పంచుకున్నారని ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీకి చెందిన మరో ప్రజా ప్రతి నిధి వ్యాపారికి అండగా నిలిచి బాలికను ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించగా గర్భవతి కాదని తేలింది. వ్యాపారి బాలికపై తన లైంగిక వేధింపుల పాల్పడలేదని నా వద్ద తీసుకున్న రెండు లక్షలు ఇవ్వాలని పంచాయతీ పెట్టి తీసుకున్న ప్రజాప్రతినిధీ తో గొడవ దిగడం  ఇది పత్రికల్లో రావడం వివాదం మండలంలో చర్చ నియాంశంగా మారింది.

ఈ గొడవలకు కారణం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు వ్యాపారుల మధ్య పోటీ కూడా కారణమనే ప్రచారం జరుగుతుంది. కొండాపూర్ యాప కేంద్రంలో ఇలాంటి మహిళల లైంగిక వేధింపుల కేసులు విరివిగా జరుగుతు పంచాయతీలు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. వాటిని బయటకు రాకుండా నాయకులు జాగ్రత్తలు పడుతున్నారు. 

మాజీ ప్రజా ప్రతినిధి కొడుకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని జరిమానాలు.

 కొండాపూర్ యాప కేంద్రంలోని ఒక మాజీ ప్రజా ప్రతినిధి కొడుకు  కొద్ది నెలల క్రితం  చిరు వ్యాపారం చేసే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రచారం జరిగింది. స్థానిక నాయకులు గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని వేరే గ్రామంలో పంచాయతీ పెట్టి  బాధిత మహిళకు 1.5 లక్షలు చెల్లించి కేసులు కాకుండా చేసుకున్నాడనే ప్రచారం జరుగుతుంది. అవమానంతో చిరు వ్యాపారం చేసే మహిళ గ్రామం నుండి వెళ్లిపోయింది. మహిళల వేధింపుల సంఘటనలు జరుగుతున్న స్థానిక పోలీసులు పట్టించుకోక పోవడం పట్ల స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన  రాజకీయ నాయకులు మధ్య దళారులుగా వ్యవహరిస్తూ ఇరుపక్షాల వద్ద డబ్బులు గుంజుకుని జల్సాలు చేసుకుంటున్నారు అనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నా యి.

రోడ్లమీద భూములను అక్రమంగా అమ్ముకొని లక్షలు  సంపాదిస్తున్న నాయకులు.

మండల కేంద్రానికి కొండాపూర్ యాప సెంటర్లో ఉండడం,  చుట్టుపక్క గ్రామాల వారు ఇక్కడ నుండే  నిత్యవసర వస్తువులు, ఎరువులు బట్టలు వ్యవసాయ సామాగ్రి కొనడం వల్ల  వ్యాపారపరంగా  అభివృద్ధి చెందింది. గ్రామంలోని భూమికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. గజానికి  ₹1000 కంటే ఎక్కువ ధర పలుకుతుంది.దీంతో రోడ్లమీద భూములపై నాయకుల కన్ను పడి కబ్జాలు చేస్తున్నారు.

 కొండాపూర్ గ్రామం పేరుకు గ్రామ పంచాయతీ గా ఉన్న  మురికి కాలువలు,రోడ్లు అక్రమణాలకు గురవుతు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకోవడంలేద ని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 గ్రామ దేవత పోచమ్మ గుడి భూమి ఆక్రమణ.

కొండాపూర్ గ్రామస్తుల ఆరాధ్యదై వం గ్రామ దేవత పోచమ్మ గుడి  ముందు వెనక భూమి ఆక్రమణ కు గురైన పట్టించుకునే నాధుడు లేడు. పోచమ్మ గుడి ముందు ఇంటి నిర్మాణం, వెనక రహదారి ఆక్రమణతో భక్తులు పోచమ్మ గుడికి వెళ్లాలంటేనే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామస్తులంతా ఉగాది పండుగకు పోచమ్మ దేవతకు మొక్కులు చెల్లించుకునే గుడి చుట్టూ జాగ లేకపోవడంతో ఎన్నో అవస్థలకు గురవుతున్న ఎవరు పట్టించుకో వడం లేదు.

మండల ప్రధాన రోడ్డు మీద భూములను ఆక్రమించి అక్రమ కట్టడాలు .

మండల  రోడ్లు భవనాల శాఖ ప్రధాన రహదారిపై భూమిని ఆక్రమించి దుకాణాల కోసం అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. వీటికి విపరీతమైన పోటీ ఉండడంతో  లక్షల్లో కొనుగోలు జరుగుతున్నా యి. అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారి వద్ద ఇటీవల స్థానిక అధికార పార్టీ నాయకులు లక్ష రూపాయలు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతుంది.

రోడ్డు మీది భూమిని అమ్ముకున్న మండల ప్రముఖ ప్రజా ప్రతినిధి.

 కొండాపూర్ గ్రామంలోని ఆంజనేయ గుడి వెనుక ఉన్న గిరిజన గ్రామానికి వెళ్లే రహదారిపై ఉన్న పది గజాల భూమిని 70 వేలకు మండల ప్రజా ప్రతినిధి  అధికార పార్టీ యువ నేత తన పట్టా భూమని గ్రామస్తులను బెదిరించి వేరే వారికి విక్రయించాడు. ఆ స్థలంలో రోడ్డు మీదనే షట్టర్ నిర్మించడంతో తమ గ్రామానికి వాహనాలు వచ్చే పరిస్థి లేదని గిరిజనులు ఆందోళనకు దిగిన  నాయకులు పట్టించు కోవడం లేదు. మండల ప్రధాన రహదారిని ఆక్రమించి మట్టి పోయడం, మురికి కాల్వలను ఆక్రమించడం వల్ల  వర్షాకాలంలో వర్షపు నీరు అంతా ప్రధాన రహదారిపై నిలిచి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గుంతలతో గత రెండు సంవత్సరాలు గా  వాహనదారులు మండల ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.


రహదారిపై నీరు రాకుండా చూసేందు కు కల్వర్టు నిర్మాణానికి 10 లక్షల నిధులు మంజూరు అయ్యాయని అధికార పార్టీ నాయకుడు ప్రకటనలు చేసి నెలలు గడుస్తున్న పని ప్రారంభం కాకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 మహిళలపై లైంగిక వేధింపులు కబ్జాలపై  జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కొండాపూర్ వాసులు కోరుతున్నారు.