కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే గ్రామాల అభివృద్ధి.
-- వేముల కృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

సోనాపూర్ పంచాయతీలో కాంగ్రెస్ పాదయాత్ర లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.
Scv News Kasipet:--
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గ్రామాలు అభివృద్ధి పథంలోకి వస్తాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ గిరిజన గూడాల ప్రజలకు హామీలు ఇచ్చారు.రాహుల్ గాంధీ తలపెట్టిన హత్ సే హత్ జోడో యాత్ర కు అనుసంధానంగా హత్ సే హత్ అభియాన్ యాత్ర లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం లో 25 రోజులు జరిగే పాదయాత్ర కాసిపేట మండలంలో ఆదివారం నాటికి రెండోరోజుకుంది. పాదయాత్రా కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ అధ్యక్షతన గాట్రావు పల్లెలో బసచేసి ఉదయం 9:00 యదావిధిగా పాదయాత్ర కొనసాగింది. ఈరోజు కొత్తగూడా, జెండాగూడా, సాలెగూడా, దొడ్డిగూడ, సోనాపూర్, లక్ష్మీపూర్, కుర్రేగాడ్, వెంకటాపూర్ గ్రామాలు తిరిగి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పల్లెలలు బాగుపడతాయని వివరిస్తూ అన్ని గ్రామాలు తిరిగి వెంకటాపుర్ బసచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రోడ్డ శారద ముడిమడుగు మహేందర్, నాథరీ స్వామి మండల నాయకులు ఎంపిటిసిలు భీం రావ్, పార్వతి మల్లేష్ మాజి సర్పంచ్ లు ప్రభాత్ రావు,జాడి శంకర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కనుకుల రాకేష్, మైనారిటీ సెల్ షాకీర్,సీనియర్ నాయకులు కనకరాజు,మడావి వెంకటేష్, జనార్ధన్ రెడ్డి, ఖదీర్, జయరాం, అచ్యుతరావు,మెస్రం భీం రావ్, కోవా సోము, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
