మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బెల్లంపల్లి నియోజకవర్గ పాదయాత్ర విజయవంతం చేయాలి.

పల్లె పల్లేకు  కాంగ్రెస్ పార్టీ నాయకుల యాత్ర .

- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ.

 ధర్మ రావు పేటలో నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ 

Scv News Kasipet :--

ఈనెల 12 నుంచి కాశిపేట మండలంలోని దేవాపూర్ కేంద్రం నుంచి ప్రారంభించే పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ కోరారు. కాసిపేట మండలం లోని ధర్మారావు పేట గ్రామంలో నియోజకవర్గస్థాయి సమావేశాన్ని మండల అధ్యక్షులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన సాయంత్రం 3 గం లకు దేవాపూర్ నుంచి మొదలయ్యే పాద యాత్ర 25 రోజులపాటు  నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాసిపేట మండలంలో 5 రోజుల పాటు యాత్ర కొనసాగానున్నట్లు తెలిపారు. యాత్ర ప్రారంభానికి  ఏఐసీసీ సభ్యులు, ఎలక్షన్ కమిటీ మెంబర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు సురేఖ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నట్లు పేర్కొన్నారు తెలిపారు.  ప్రతి పల్లె పల్లేకు కాంగ్రెస్ పార్టీ వెళ్లేందుకు ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి ప్రభాకర్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్, రొడ్డ శారద శ్యామ్, నాతరి స్వామి, ఎంపిటిసిలు మల్లేష్ పద్మ శంకర్, మాజీ సర్పంచులు జాడిశంకర్ ప్రభాత్ రావు, యువజన మండల అధ్యక్షులు రాకేష్, గోలేటి స్వామి, జయరాం, ఓరియంట్ సిమెంట్ కాంట్రాక్టు అధ్యక్షుడు అన్నం కుమార్, రసీదు, ఉడుతలు రాజన్న,పెద్దిరాజు, ఖదీర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.