జయశంకర్ సార్ ఆశయాలకు తూట్లు పొడిచిన బిఆర్ఎస్ ప్రభుత్వం.
- శిలోజు మురళి విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్రకార్యదర్శి
![]() |
| జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేస్తున్న విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు. |
![]() |
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు నిరాహార దీక్ష శిబిరం ముందు మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ సార్ 189వ జన్మదినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆచార్య జయశంకర్ చిత్రపటానికి విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి శిల్లోజు మురళి, మండల కార్యదర్శి గొల్లపల్లి రాజేందర్ చార్యులు , కోశాధికారి సిలోజు నరసింహ చారి, మండల కమిటీ గొల్లపల్లి శ్రీనివాస్, కంచ శంకరయ్య, సిలోజు నరసింహ చారి పూలు సమర్పించారు. పంచాయితీ కార్మిక సంగం తరపున దాసరి రాజన్న చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి
సిలోజు మురళి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశ్వబ్రాహ్మణుడైన ఆచార్య జయశంకర్ సార్ తన జీవితాన్ని త్యాగం చేశాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. జయశంకర్ ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదని విమర్శించారు. ప్రస్తుత తెలంగాణలో సాగుతున్న 9 ఏళ్ల పాలనలో ఏ వర్గం సుఖశాంతులతో లేదని అన్నారు.
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ నిజమైన జాతిపిత ఆచార్య జయశంకర్ సార్ అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కు జయశంకర్ చేసిన సేవలు మరువలేనీవన్నారు. నీళ్లు, నిధులు,నియామకాల కోసం 1200 అమరవీరుల ప్రాణ త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ దోపిడి దొంగల మాయమైందని విమర్శించారు. కరోనా సమయంలో ఎంతో సేవలందించిన పారిశుద్ధ కార్మికులు 32 రోజులుగా తమ సమస్యల పరిష్కారం సమ్మె చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు.
పంచాయతీ కార్మికుల సంఘం నాయకుడు దాసరి రాజన్న మాట్లాడుతూ జయశంకర్ సార్ తన ప్రాణ త్యాగంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. రాష్ట్రంలో ఆయన ఆశల మేరకు పాలన సాగడం లేదని విమర్శించారు. గ్రామాలలో మురికిని ఎత్తిపోసే పారిశుద్ధ కార్మికులు మా సమస్యలు పరిష్కరించాలని 32 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలందరికీ సేవలందించారని గుర్తు చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను వివరింప చేయాలని కోరారు.

