కళ్యాణి ఖని ఓసి పరిసరాల్లో హరితహారం.
Scv news Kasipet:--
తెలంగాణకు హరితహారం కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఏ.మనోహర్ ఏరియాలో పదివేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కే కే ఓ సి సమీపంలో ఏరియాలోని వివిధ అధికారులు గుర్తింపు కార్మిక సంఘాల నాయకుల సమక్షంలో కాసిపేట రాళ్లవాగు వద్ద ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా G.m మనోహర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సింగరేణి అధికారులు ఉద్యోగులు నాయకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం చాలా మంచి పరిణామం అన్నారు.ఈ ఒక్కరోజు పదివేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా మన బాధ్యతగా తీసుకున్నప్పుడే అవి వృక్షాలు అయి మన పర్యావరణ సమతుల్యానికి దోహద పడతాయ ని రాబోవు భవిష్యత్తు తరాల వారికి మంచి పర్యావరణాన్ని అందించిన వారమవుతామని వారు అన్నారు.
అదేవిధంగా సింగరేణి కాలరీస్ యాజమాన్యం కాలానుగుణంగా కొన్ని కోట్ల మొక్కలు నాటడం, పెంచడం, పంచడం. లాంటి కార్యక్రమాన్ని చేస్తూ వస్తుందని, అదేవిధంగా సింగరేణి ప్రభావిత ప్రాంతంలోని ప్రజలకు మొక్కలను పంచి పర్యావరణానికి దోహదం చేసే చర్యలు చేపడుతున్నామని అన్నారు.
ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వీకరించి తమ తమ ప్రాంతాలలో మొక్కలు పెంచి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఓ రవీందర్ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సి ఎం ఓ ఏ ఐ అధ్యక్షులు పైడిశ్వర్, కేకే ఓసి ప్రాజెక్టు ఆఫీసర్ రమేష్, ఫారెస్ట్ అధికారి రమణారెడ్డి, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్,కాసిపేట గని మేనేజర్ అల్లావుద్దీన్,Dy PM సత్య బోస్,Sr. PO మీర్జా గౌస్ జీషాన్,బన్న లక్ష్మన్ దాస్, TBGKS నాయకులు బడికెల సంపత్,O రాజా శేఖర్, బైరి శంకర్, మరియు ఇతర ఉన్నతాధికారులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

