గ్రామ గ్రామాన గృహలక్ష్మీ కౌంటర్ లు ఏర్పాటు చేయాలి.
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ

గృహ లక్ష్మీ దరఖాస్తుల గడువు పెంచాలని తహసీల్దార్ కు వినతి పత్రం ఇస్తున్న మండల కాంగ్రెస్ నాయకులు.
Scv News Kasipet:--
కాసిపేట తహశీల్దార్ కార్యాలయంలో కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో గృహలక్ష్మీ పథకానికి సంబంధించిన కౌంటర్ లు ప్రతి గ్రామ గ్రామాన గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని ఈరోజు మండల కాంగ్రెస్ నాయకులు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ మండలంలో కేవలం ఒక్కటే దగ్గర అది కూడా ఒకటే కౌంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో దూరం నుండి వచ్చేవారు పొద్దున నుండి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే గృహలక్ష్మీ దరఖాస్తు చేసుకునే గడువు కూడా పెంచాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చామని, అలాగే గత 9 సంవత్సరాల క్రితం అర్హులైన అందరికి డబుల్ బెడ్రుమ్ ఇస్తామని ఇంటికి 5 లక్షలు ఇస్తామని ఇప్పుడు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇవ్వలేదని 5 లక్షలు ఇస్తామన్నవి కాస్త 3 లక్షలు అని అవి కూడా 3 రోజుల గడువు మాత్రమే ఇచ్చి ఇలా కార్యాలయా ల వెంట తిప్పుకుంటు ఇబ్బందు లకు గురిచేస్తున్నారని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని,కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుల రాకేష్,యూత్ నాయకులు నండికొండ శ్రీధర్,పైడిమల్ల జనార్దన్,అరుట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.