మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

 గృహలక్ష్మి  దరఖాస్తుల గడువు పెంచాలి.

 - సూరం సంపత్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి.

 గృహలక్ష్మి దరఖాస్తులు గడువు పెంచాలని తాసిల్దార్ కు వినతి పత్రం ఇస్తున్న బిజెపి నాయకులు.

Scv News Kasipet:--

 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహ లక్ష్మి పథకం  నాలుగు రోజులు గడువు పెట్టడం, వైన్ షాపులకు 15 రోజులు టెండర్లు  ఇవ్వడం ఎంత వరకు సమంజసమని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ ప్రశ్నించారు. ఈరోజు గృహలక్ష్మి పథకానికి పేదలు చేసుకునే దరఖాస్తు సమయాన్ని పొడిగించాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. కాసిపేట మండలం  లో 70 నుండి 80 శాతం నిరుపేదల కు భూమలు   అబది, ఇందిరమ్మ ఇనం భూములు, అసైన్డ్ భూములు, మరియు గ్రామ కంఠం భూములు ఎక్కువుగా ఉన్నాయి. బుత్తో నిబంధనల వరకు ఈ పథకము వర్తించదు. ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి నిర్దేశించిన మార్గదర్శకాలతో సంబంధం లేకుండా నియోజక వర్గంలో  పట్టాలతో సంబంధం లేకుండా గ్రామీణ స్థాయిలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి నిజమైన నిరుపేదలను పారదర్శకంగా ఎంపిక చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.  ఈ కార్యక్రమంలో మండల లోకల్ ఇంచార్జ్ అటుక పురం రమేష్,మండల ఉపాధ్యక్షులు పులవేణి పోశం యువ మోర్చ నాగరపు ప్రసన్న, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు పెద్దపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నరు.