మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

 నేడు.

కాసిపేట ప్రెస్ క్లబ్ లో  గద్దర్ సంస్మరణ సభ.


Scv News కాసిపేట :-ప్రజాయుద్ధ నౌక అమరుడు గద్దర్ అన్న సంస్మరణ సభ కాసిపేట మండల ప్రెస్ క్లబ్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  ఈరోజు  10 గంటలకు  నిర్వహించడం జరుగుతుంది గద్దర్ విప్లవోద్యమం, దళిత ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన ఆటపాటలతో క్రియాశీల పాత్ర పోషించాడు. తన జీవితాంతం ప్రజల కోసమే జీవించిన మహనీయ మూర్తి ప్రజా గాయకుడు గద్దర్.

గద్దర్ ను స్మరించుకుంటూ స్థానిక  ధూమ్ ధామ్ కాళాకారులతోసాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

మండలంలోని  వివిధ ప్రజా సంఘాల నాయకులు, గద్దర్ అభిమానులు హాజరు కావాలని మనవి.