ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం ఈ తరానికి తీరని లోటు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ.
![]() |
| ప్రజా గాయకుడు గద్దర్ కు నివాళులర్పిస్తున్న మండల కాంగ్రెస్ నాయకులు. |
Scv News Kasipet :--
కాసిపేట మండల కేంద్రంలోని ధర్మారావు పేటలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వేముల కృష్ణ మాట్లాడుతూ బ్రతికినంత కాలం పేద బడుగు బలహీన వర్గాలకోసం బ్రతికి వారి కష్టాలను పాట రూపంగా ప్రశ్నిస్తూ ఉన్నారని, ఆయన జీవితం ప్రజలకు అంకితం చేసారని ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలయిన బీజేపీ,బీఆరెస్ ప్రజలను పట్టి పీడిస్తున్నాయని అందుకని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఆయన కోరుకున్నారని,వారు అనుకున్న విధంగానే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు పార్వతి మల్లేష్,మెరుగు పద్మ-శంకర్ ,ఎస్ సి సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుల రాకేష్,మాజీ సర్పంచులు జాడి శంకర్,ప్రభాత్ రావు, ఓరియంట్ సిమెంట్ కార్మికుల సంఘం నాయకులు అన్నం కుమార్, సీనియర్ నాయకులు రషిద్, ఖదీర్,వేణు, పార్వతి పెద్దన్న, ఉడుతల రాజన్న, నాయకులు మహంకాళి, చారి,జాడి శివ,యూత్ నాయకులు మహేష్, ప్రేమ్ కుమార్, మహేష్,నందికొండ శ్రీధర్,జనార్దన్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
