మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ప్రజాయుద్ధనౌక అమరుడు గద్దర్ కు కాసిపేట మండల ప్రజాసంఘాల నాయకుల ఘన నివాళి.

కాసిపేట  మండల పరిషత్ కార్యాలయంలో గద్దర్ సంతాప సభ 

 గద్దర్ కు నివాళులు అర్పిస్తున్న ప్రజా సంఘాల నాయకులు. 



Scv News Kasipet:--

ప్రజాయుద్ధనౌక అమరుడు గద్దర్ కు కాసిపేట మండల ప్రజా సంఘాల నాయకులు ఈరోజు మండల పరిషత్  కార్యాలయంలో  నిర్వహించిన సంతాప సభ లో ఘన నివాళులర్పించారు. గద్దర్ చిత్రపటానికి ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గత 50 ఏళ్లుగా పీడిత ప్రజల విముక్తి కోసం   అలుపెరగని పోరాటం చేసిన బహుజన పోరాట యోధుడని వక్తలు కొనియాడారు. సంతాప సభ కు మండల జేఏసీ కన్వీనర్ సిలోజు మురళి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా  సామాజిక చైతన్య వేదిక ముఖ్య సలహాదారులు చిన్న భీమయ్య మాట్లాడుతూ గద్దర్ మరణము తెలుగు ప్రజలకు తీరని లోటని  అతని పోరాట స్ఫూర్తిని  అతని తో కల అనుబంధాలను వివరించారు.

సిపిఐ మండల కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ గద్దర్ నిరంతరం పీడిత ప్రజల కోసం ఆడి పాడిన గొప్ప ప్రజా గాయకుడు అని కొనియాడారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు సేవ్ సింగరేణి పేరిట సింగరేణి ప్రాంతంలో పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యవంతం చేశాడని గుర్తు చేశారు.

సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ తన జీవిత కాలం మొత్తం పీడిత ప్రజల కోసం అంకితం చేసి ఆడి పాడిన గొప్ప కళాకారుడు గద్దర్ అని అన్నారు. ఆదివాసి ఉద్యమాలు ఇంద్రవెల్లి పోరాటంలో పాల్గొని చైతన్య వంతం చేయడంలో  క్రియాశీల పాత్ర ప్రజా గాయకుడు గద్దర్ దని కొనియాడారు.

తెలంగాణ ఉద్యమకారుడు రాంటెంకి వాసుదేవ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి గద్దర్ పాటల  ప్రధాన కారణం అన్నారు. గద్దర్ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణను సాధించు కున్నామని గుర్తు చేశారు.

 పంచాయతీ కార్మిక సంఘం నాయకుడు దాసరి రాజన్న మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ మరణం దళిత ఉద్యమానికి తీరని లోటని అన్నారు. జీవితాంతం దళితుల చైతన్యం కోసం పోరాడిన మహాయోధుడని కొనియాడారు.

తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీను మాట్లాడుతూ నిరంతరం పీడిత ప్రజల కోసం పాటుపడే ప్రజా గాయకుడు గద్దర్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అన్నారు. గద్దర్ తో ప్రజా ఉద్యమాలతో తనకు నా అనుబంధాన్ని వివరించారు.

సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ ప్రజాయుద్ధనౌక గద్దర్ మరణించడం భారతదేశ విప్లవానికి బహుజన ఉద్యమానికి తీరని లోటు అన్నారు. నక్సల్ బరి   ఉద్యమం తో పాటు తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీల పాత్ర పోషించాడని అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని నిర్బంధాలు పెట్టినా వారి కి లొంగకుండా చివరి కొరకు ప్రజల కోసమే ఆడి పాడిన గొప్ప ప్రజా గాయకుడు అని కొనియాడారు. సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం తరపున కవిరాజ్ తదితరులు మాట్లాడారు.