ఘనంగా
కాసిపేట ప్రెస్ క్లబ్ లో ప్రజాయుద్ధనౌక గద్దర్ సంస్మరణ సభ.
![]() |
| గద్దర్ సంస్మరణ సభలో పాల్గొన్న పాత్రికేయులు ప్రజాసంఘాల నాయకులు. |
Scv News Kasipet:--
ప్రజాయుద్ధ నౌక అమరుడు గద్దర్ సంస్మరణ సభ కాసిపేట మండల ప్రెస్ క్లబ్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది . సమావేశం జర్నలిస్టు సంఘం జిల్లా నాయకుడు మన మన తెలంగాణ పత్రిక మండల రిపోర్టర్ రవిరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముందు ప్రెస్ క్లబ్ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు అమరుడు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కాసిపేట మండల బహుజన కళామండలి కళాకారులు ప్రముఖ కవి గాయకుడు గొడిసెల బాపు నాయకత్వంలోని సాంస్కృతిక బృందం గొడిసెల కృష్ణ కిషన్, స్వామీ, కోట రాజేష్ ల ఆధ్వర్యంలో గద్దర్ ను స్మరిస్తూ పాడిన పాటలతో కార్యక్రమం ప్రారంభమైంది. తదానంతరం గద్దర్ ఉద్యమము అతనితో ఉన్న అనుబంధాల విషయమై ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు.
ఈ సందర్భంగా సాక్షి రిపోర్టర్ కూకట్ల రాజేష్ మాట్లాడుతూ సమాజ మార్పు కోసం గద్దర్ జీవితాంతం ఆటపాటల తో ఎంతోమంది యువకులను ఉద్యమంలోకి తీసుకువచ్చారన్నారు. అతని ఆటపాటకు ఆకర్షితునైన యువకులే నేటి విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారని గుర్తు చేశారు.
కవి గాయకుడు గొడిసెల బాపు మాట్లాడుతూ గద్దర్ అంటే ఒక విప్లవోద్యమమని గద్దర్ లాంటి మహా వ్యక్తి యుగానికి ఒక్కరు పుడతారని అన్నారు. గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని వివరించారు.
సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ పేద ప్రజల విముక్తి కోసం జీవితాంతం పోరాడిన గద్దర్ ను ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధింపులకు గురిచేసిందని రాజ్య హింస వల్లనే చనిపోయాడన్నారు.
తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్ మాట్లాడుతూ గద్దర్ పీడిత ప్రజల కోసం జీవితాంతం ఉద్యమించాడని అతని త్యాగం వెలకట్టలేనిదన్నారు. ఈ దేశ బహుజన సమాజానికి దొరికిన వజ్రమని కొనియాడరు.
సామాజిక చైతన్య వేదిక సలహాదారు చిన్న భీమన్న మాట్లాడుతూ గద్దర్ పేద ప్రజల కోసం తన జీవితం త్యాగం చేసిన మహా గొప్ప వ్యక్తిని అన్నారు. దేశంలో ఇలాంటి కళాకారుడు కోటి మందికి ఒకరు పుడతారని అన్నారు.
మండలా ఐ కాస కన్వీనర్ శిలోజు మురళి మాట్లాడుతూ గద్దర్ బహుజనుల్లో ప్రశ్నించే తత్వాన్ని తన ఆటపాటలతో నేర్పించాడు అన్నారు.
నాతకాని సంఘం రాష్ట్ర నాయకుడు దుర్గం గోపాల్ మాట్లాడుతూ గద్దర్ ప్రజా పోరాటాలతో 30 ఏళ్ల నుండి పరిచయం ఉందన్నారు. గద్దర్ మొదట విప్లవ ఉద్యమం, తరువాత దళిత ఉద్యమం చివరలో బౌద్ధం పట్ల ఆకర్షితమై వాటి కోసమే పని చేశాడన్నారు.
అంబేద్కర్ వాది దాసరి రాజన్న మాట్లాడుతూ దేశంలో సమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం పాటలు పాడి ప్రజల కోసం జీవించిన గొప్ప వ్యక్తి గద్దర్ అని అన్నారు.
నాయక్ కోడ్ సేవా సంఘం రాష్ట్ర నాయకుడు తట్ర భీమ్రావు మాట్లాడుతూ బహుజన సమాజాన్ని ఉన్నతీకరించేందుకు తన ఆటపాటలతో ఉద్యమాలు నిర్మించిన గొప్ప కళాకారుడు గద్దర్ అని కొనియాడారు.
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ గద్దర్ మరణం భారతదేశ విప్లవ దళిత ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. 1983 నుండి గద్దర్ పాటలకు ఆకర్షితుల మై కాసిపేట మండలంలో విప్లవోద్యంలో గద్దర్ పాటలు పాడుతూ గ్రామాల్లో ప్రచారం చేశామని గుర్తు చేశారు.
చివరగా గద్దర్ నుస్మరిస్తూ కొమ్ముల బాపు పాట పాడారు. గద్దర్ విప్లవోద్యమ జీవితంపై సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య పాట పాడి వందన సమర్పణ చేసి సమావేశాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు సిటీ కేబుల్ రిపోర్టర్ నజీర్, తిరుపతి, శ్రీధర్, రమేష్, అనిల్, మోతిరామ్, అంబేద్కర్ సంఘం నాయకుడు వాసుదేవ్, ధర్మ సమాజ్ పార్టీ నాయకుడు గొడిసెల సురేందర్, మండల గౌడ సంఘం అధ్యక్షుడు మార్క శ్రీనివాస్ గౌడ్, భోగ పోశం, నాగపూర్ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.





