మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో దుర్గం చిన్నయ్య కు ఎమ్మెల్యే టికెట్ రావడం పట్ల బారసాశ్రేణుల సంబరాలు.

 దుర్గం చిన్నయ్య కు మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు కృషి చేస్తాం.


 కాసిపేట మండలంలో బారాస శ్రేణుల సంబరాలు.

Scv News Kasipet:--

బెల్లంపల్లి నియోజకవర్గ  ఎమ్మేల్యే టిక్కెట్టు మూడవసారి  దుర్గం చిన్నయ్య కు ఇస్తూ కెసిఆర్ ప్రకటించడం పట్ల కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన  మండల బారాస శ్రేణులు సంబరాలు జరుపున్నారు. నియోజకవర్గంలో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించి పెట్టేందుకు తీవ్రంగా కష్టపడతామని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆయా గ్రామాలలోని ప్రధాన వీధుల్లోకి వచ్చి కేరింతలు కొడుతూ టపాసులు పేల్చారు. దేవాపూర్ ఓరియంట్ గేట్ ముందు బారాస మండల అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ టపాసులు పేల్చారు. ధర్మరావుపేటలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులారెడ్డి  ఆధ్వర్యంలో కార్యకర్తలు గ్రామంలో సంబరాలు చేశారు. కొండాపూర్,తాటి గూడెం, బుగ్గ గూడెం రొట్టె పెళ్లి కాసిపేట ముత్యం పల్లి గ్రామాలలో పార్టీ నాయకులు ఆయా గ్రామాల సర్పంచులు వీధుల్లోకొచ్చి సంబరాలు చేసుకుంటూ టపాసులు పేర్కొన్నారు. దుర్గం చిన్నయ్యకు మూడవసారి టికెట్ రాకుండా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసిన  వాటిని పట్టుచుకోకుండా  మూడోసారి టికెట్ కేటాయించినందుకు కేసిఆర్ కు మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మూడోసారి తప్పనిసరిగా హ్యాట్రిక్ విజయం సాధించేందుకు కార్యకర్తలమంతా కృషి చేస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.