మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో 43 మందికి బీసీ బంధు పథకం.

 కాసిపేట మండలంలో 43 మందికి బీసీ బంధు పథకం.

 బిసి బంధు పథకం చెక్కును జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకుంటున్న కొండాపూర్ నాయి బ్రాహ్మణ లబ్ధిదారు రామచంధర్.

 బీసీ బందు చెక్కును లబ్ధిదారు కు అందజేస్తున్న కాసిపేట మండల జడ్పిటిసి పల్లె చంద్రయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, వైస్ఎం పీపీ విక్రం రావు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు సపోర్టు శంకర్  లు.

Scv News Kasipet:--

 రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలలోని చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం చేసి ఆదుకునేందుకు చేపట్టిన బీసీ బందు పథకం కాసిపేట మండలంలో మొదటి విడతగా వివిధ గ్రామాలలోని 43 మందికి మంజూరు అయ్యాయి.

 వీరికి ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో  జిల్లా కలెక్టర్ ప్రశాంత్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతుల మీదుగా  చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో   మండల ప్రజా ప్రతినిధులు ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ  విక్రమ్ రావు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీల చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు నాయకులు హాజరయ్యారు.