కాసిపేట మండలంలో రైతు వేదికల వద్ద రుణమాఫీ పై బారాస శ్రేణుల సంబరాలు.
![]() |
| ధర్మ రావు పేట రైతు వేదిక వద్ద బారాసాశ్రేణుల సంబరాలు. |
Scv News Kasipet:--
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల రుణమాఫీ ప్రకటన చేసినందుకు ఈరోజు కాసిపేట మండలంలోని ముత్యంపల్లి ధర్మారావు పేట రైతు వేదికల వద్ద బారసాశ్రేణులు సంబరాలు జరుపు కున్నాయి. ధర్మ రావు పేట రైతు వేదిక వద్ద మండల బారసా అధ్యక్షుడు రమణారెడ్డి, మండల రైతు సమన్వయ సంఘ అధ్యక్షుడు దుర్గం పోశం, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులా రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆడే జంగు, అజ్మీర తిరుపతి మక్కల శ్రీనివాస్ ము త్యాల స్వప్న, మండల నాయకులు సుధాకర్ రెడ్డి, బాణాల సత్యనారాయణ వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు బారాస పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ముత్యం పల్లి రైతు వేదిక...
![]() |
| ముత్యం పల్లి రైతు వేదిక వద్ద బారసా నాయకులు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. |
ముత్యంపల్లి రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి కేసి ఆర్ ప్రకటించిన రైతు రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారి చేసిన సందర్బంగా మండల బారసా నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా జడ్ పి టిసి పల్లె చెంద్రయ్య వైస్ ప్రెసిడెంట్ పుస్కూరి విక్రమ్ రావులు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రకటించిన రుణమాఫీని 36,000రూపాయలు అమలు చేయడం జరిగింది ఈ రోజు నుండి 1లక్ష రూపాయలు రుణ మాఫీ త్వరలో మాఫీ చేయడం చాలా అభినంద నీయం అన్నారు అలాగే ముఖ్యమంత్రి రైతుల పక్షాన రైతు బంధు, రైతు బీమా ఉచిత 24గం ల కరెంటు సకాలంలో ఎరువులు విత్తనాలు, రైతులకు అనుకూలం గా నిర్ణయాలు తీసుకొని రైతుల అభివృద్ధికి కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు లేనిపోని అనవసర ఆరోపణలు చేస్తున్నాయి అని అన్నారు ఈ కార్యక్రమం లో ఎంపిటిసి కొండబత్తుల రాంచేందర్. ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, బి ఆర్ ఎస్ కార్యదర్శి మొటూరి వేణు, అగ్గి సత్తయ్య, బి ఆర్ ఎస్ నాయకులు సురేందర్, షేంషీర్, కరీం,బీమయ్య. లంక లక్ష్మణ్, మద్దెవేణి వేణు, మెడ రాంచేందర్. బుక్య రాంచేందర్, గంగాధరి రాజేశం,మల్లేష్, సచిన్, కిషోర్, ఇంతు, శ్రీనివాసగౌడ్, భూమన్న, శేఖర్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు

